BigTV English

Excise Department: బీరు ప్రియులారా.. తస్మాత్ జాగ్రత్త!

Excise Department: బీరు ప్రియులారా.. తస్మాత్ జాగ్రత్త!

Excise Department: కూల్ కూల్ బీరు అందుకున్నాడు. ఫ్రెండ్స్ తో కూర్చున్నాడు. సినిమా స్టైల్ లో బీరు సీసా ఓపెన్ చేశాడు. ఇంకేముంది అతని నాలుక రపరపమంది. ఒక చుక్క గొంతులో వేసుకున్నాడు. ఏదో టేస్ట్ తేడాగా ఉండడంతో, మళ్లీ సీసాలో చూశాడు, ఇంకేముంది పరుగుపరుగున వైన్స్ షాప్ వద్దకు చేరుకున్నాడు. పాపం అంతలోనే ఏం జరిగిందని అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే.


ఓ యువకుడు ఆశగా బీరు సీసా కొనుగోలు చేసి చివరకు ఖంగుతిని, ఏకంగా ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసేవరకు వెళ్లాడు. అంతలా ఆ బీరు ప్రియుడికి కోపం రావడానికి పెద్ద కారణమే ఉంది. అయితే సదరు వైన్స్ షాపు యజమాని ఇచ్చిన సమాధానంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యువకుడు ఫిర్యాదు వరకు వెళ్లాడు. ఎట్టకేలకు అధికారులు కూడ ఆ బీరులోని కాస్త సేకరించి శాంపిల్స్ కు పంపించేందుకు సిద్దమవుతున్నారు.

పెద్దపల్లి జిల్లా రంగం పల్లి లోని శ్రీ వెంకటేశ్వర వైన్స్ లో శ్రీనివాస్ అనే యువకుడు బీరు కొనుగోలు చేశాడు. స్నేహితులతో కలిసి తాగేందుకు సిద్దమయ్యాడు. అంతలోనే బీరు లో ఉన్న చెత్తను గమనించి షాక్ కు గురయ్యాడు. అప్పటికే కొంత బీరు తాగిన యువకుడు స్థానిక వైన్స్ షాపు నిర్వాహకులను నిలదీశాడు.


తమకు సంబంధం లేదని యాజమాని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారట. దీంతో శ్రీనివాస్, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. షాంపిల్ సేకరించి ల్యాబ్ పంపుతామని ఎక్సైజ్ అధికారులు తెలిపినట్లు సమాచారం. జిల్లాలో తరుచూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటుండగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు డిమాండ్ చేస్తున్నారు.

ఒకటి కాదు రెండు కాదు ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు కోకొల్లలు వస్తున్నాయని బీరు ప్రియులు ఆరోపిస్తున్నారు. మరి తయారీలో తేడా జరుగుతోందా? లేక మరెక్కడైనా తప్పు జరుగుతుందా అన్నది ఎక్సైజ్ శాఖ అధికారులు తేల్చాల్సి ఉంది. రానున్నది ఎండాకాలం. బీర్లకు గిరాకీ ఎక్కువ. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడ, నాణ్యతా ప్రమాణాలు పాటించని బీర్ల యాజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికైనా బీరు త్రాగే వారు తస్మాత్ జాగ్రత్త.. ఒకసారి చెక్ చేయండి.. లేకుంటే ప్రాణాలు పోతాయని హెచ్చరిస్తున్నాడు శ్రీనివాస్.

Also Read: CM Revanth Reddy: చెప్పాం.. చేసి చూపించాం.. రాహుల్ మాట నిలబెట్టాం.. సీఎం రేవంత్ కామెంట్స్

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×