Nandamuri Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే ఆయనకు పద్మభూషణ్ అవార్డు వరించింది. ఇక దీంతో ఇండస్ట్రీ మొత్తం ఆయనకు శుబాకాంక్షలు చెప్పుకొచ్చారు. అభిమానులతో పాటు బాలా బాబాయ్ కు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సైతం శుభాకాంక్షలు తెలిపారు. ఇక బాలయ్యకు పద్మభూషణ్ రావడంతో నందమూరి, నారా కుటుంబాలు కలిసి ఒక సన్మాన సభను ఏర్పాటు చేసాయి. ఈ సభలో కేవలం ఇరు కుటుంబాల వారితో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నాడు.
ఇక ఈ వేడుకలో బాలయ్యను.. ఆయన అక్కాచెల్లెళ్లు ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి.. బాలయ్య కు చుక్కలు చూపించారు. చిన్నతనం నుంచి బాలయ్య చేసిన అల్లరి పనులు, వసుంధరతో ప్రేమ, పెళ్లి.. ఇలా అన్ని విషయాలను రాబట్టారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య కాలేజ్ లవ్ స్టోరీని కూడా చెప్పించారు.
” బాలా అన్న కాలేజ్ లో నువ్వు ఎవరి వెంట పడలేదా.. ? నీ క్రష్ ఎవరు.. ?” అని భువనేశ్వరి అడగ్గా.. బాలయ్య.. అందరిని చూసేవాడిని, అందరు నాకు అందంగా కనిపిస్తారు అని.. నేను ఎవరి వెనుక పడలేదు కానీ, నా వెనుక ఒక అమ్మాయి పడిందని తెలిపాడు. ఆ కథ ఇప్పుడు వద్దులే అని అనగా.. భువనేశ్వరి.. బాలయ్య ఫ్రెండ్ పార్థాతో ఆ కథను చెప్పించింది.
” మా మధ్య సీక్రెట్స్ ఏం లేవు. అన్ స్టాపబుల్ షో వచ్చింది. అది గ్లోబల్ గా రీచ్ వెళ్ళింది. అందులోనే అన్ని పేర్లు చెప్పేశాం. బాలయ్య ఎవరి వెంటపడ్డాడు అనేది పక్కన పెడితే.. తన వెంట ఎంతోమంది పడ్డారు. అందులో ఒకరు ఇలియాజ్. సీరియస్ గా క్లాస్ అవుతుంటే ఒక చిన్న నోట్ రాసి పంపించింది. ఆ నోట్ లో బాలయ్యకు ఒక లెటర్ వచ్చిందని ప్రొఫెసర్ చాలా కంగారుపడి చెప్పడంతో వెంటనే నేను, బాలా గ్రౌండ్ కు పరిగెత్తాం. ఆ గ్రౌండ్ లో ఇలియాజ్.. బాలాకు ప్రపోజ్ చేసింది. ఆమె ప్రేమను బాలా ఒప్పుకోలేదు. దీంతో పగబట్టి ఆమె బాలా బండి అంతా గీతలు గీసేసి, టైర్ పంక్చర్ చేసి.. ఇలా చాలా చేసింది. నా ప్రేమను ఒప్పుకోకపోతే ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాను అని బెదిరించింది.
Akash Deep Sabir: 100 కోట్లు ఇస్తేనే ఇంట్లో వాచ్ మెన్ ను పెడుతుందేమో.. కరీనాపై నటుడు సెటైర్
ఇక ఇవన్నీ భరించలేక బాలా.. మా ఫ్రెండ్ అక్బర్ అప్పుడు అమెరికాలో IAS ఆఫీసర్. ఆయనను పిలిచి.. బాబు నువ్వే చెప్పు ఆ అమ్మాయికి. ఇప్పుడు ఇవన్నీ వద్దు అని అంటే.. ఆయన ఆ అమ్మాయికి ఏదో విధంగా చెప్పి వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. అలా ఇలియాజ్ లవ్ స్టోరీ ఆగిపోయింది. ఆ తరువాత ఇంకా చాలా కథలు ఉన్నాయి” అని చెప్పేలోపే బాలయ్య, పార్థాను ఆపేయడంతో.. పురంధేశ్వరి.. వసుంధర పెళ్లి గురించి ప్రశ్న వేసింది.
మొదటిసారి వసుంధరను ఎక్కడ చూసావు అనగానే తమ ఇంటి భూమి పూజ రోజు చూశానని చెప్పాడు. చూడగానే నచ్చిందని, పెళ్ళికి ఓకే అని చెప్పగానే.. పురంధేశ్వరి బాలా అబ్బడం చెప్తున్నాడు. మొదట వసుంధరను చూసాకా కొన్నిరోజుల వరకు ఏమి మాట్లాడలేదు. అప్పుడు నాన్నగారు నన్ను పిలిచి.. బాలా ఏం మాట్లాడడం లేదు. ఒక్కసారి కనుక్కో అని అంటే నేను అడిగాను. అప్పుడు హా ఓకే అన్నాడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.