E-Paper
Advertisement

HAM Road Project: హ్యామ్ రోడ్లపై స్పందన ఏది… టెండర్లు పిలిచినా కదలని గుత్తేదారులు

HAM Road Project: హ్యామ్ రోడ్లపై స్పందన ఏది… టెండర్లు పిలిచినా కదలని గుత్తేదారులు
Advertisement

HAM Road Project:  తెలంగాణ స్వేచ్ఛ, బ్యూరో: హ్యామ్ రోడ్లకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే టెండర్లలో పాల్గొనేందుకు గుత్తేదారులు ఒక్కరూ కూడా ముందుకు రాలేదని సమాచారం. టెండర్లు గిట్టుబాటు కాకపోవడమే కారణమనే ప్రచారం జరుగుతుంది. నెలలు గడుస్తున్నా రోడ్ల పనులు ముందుకు సాగకపోవడంపై ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలో 17వేల కిలో మీటర్లు పంచాయతీరాజ్ శాఖ రోడ్లు వేయాలని ప్రభుత్వం భావించింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హామ్) విధానంలో పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. గ్రామీణ రోడ్లు బాగుంటేనే పల్లెల్లు ఆర్థికాభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావించింది. రోడ్డు సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు రోడ్లు వేసేందుకు సిద్ధమైంది. జాతీయ, ఆర్​ అండ్​ బీ రోడ్లు వేస్తున్నట్లుగానే గ్రామీణరోడ్లను వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. గ్రామం నుంచి మండల, జిల్లా కేంద్రాలకు కలిపే రోడ్లుకు అనుసంధానించనున్నారు. అందుకు హామ్ విధానంలో నిర్మించేలా ప్రణాళిక ను సిద్ధం చేసింది.

12,000 కిలోమీటర్లు ఆర్ అండ్ బీ రోడ్లను నిర్మించాలి 

రాష్ట్రంలో 17,300 కిలోమీటర్లు పంచాయతీ రాజ్ రోడ్లు, 12,000 కిలోమీటర్లు ఆర్ అండ్ బీ రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 96 నియోజకవర్గాల పరిధిలోని రోడ్ల పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. మొదటి విడతలో 7,835 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్ల నిర్మించనున్నది. ఆర్ అండ్ బీ రోడ్లను 5190 కిలో మీటర్లు నిర్వహించనున్నారు. మొదటి విడతలో ఉమ్మడి ఆదిలాబాద్ లో పంచాయతీరాజ్ రోడ్లు 1011,89 కిలో మీటర్లు, ఆర్ అండ్ బీ 577.74 కిలో మీటర్లు, కరీంనగర్ లో 696.38 పంచాయతీరాజ్, 576.94 కిలో మీటర్లు ఆర్ అండ్ బీ, మహబూబ్ నగర్ జిల్లాలో 1002.72 కిలో మీటర్లు పంచాయతీరాజ్, 629.72 కిలో మీటర్లు ఆర్ అండ్ బీ, ఖమ్మంలో 575.19 కిలో మీటర్లు పంచాయతీరాజ్, 646.36 కిలో మీటర్లు ఆర్ అండ్ బీ, మెదక్ జిల్లాలో 1084.10 కిలో మీటర్లు పంచాయతీరాజ్, 523.58 కిలో మీటర్లు ఆర్ అండ్ బీ, నల్లగొండ జిల్లాలో 1106.43 కిలో మీటర్లు పంచాయతీరాజ్, 696.68 కిలో మీటర్లు ఆర్ అండ్ బీ, నిజామాబాద్ జిల్లాలో 528.30 కిలో మీటర్లు పంచాయతీరాజ్, 362.46 కిలో మీటర్లు ఆర్ అండ్ బీ, రంగారెడ్డి జిల్లాలో 801.37 కిలో మీటర్లు పంచాయతీరాజ్, 465.74 కిలో మీటర్లు ఆర్ అండ్ బీ, వరంగల్ జిల్లాలో 1028.46 కిలో మీటర్లు పంచాయతీరాజ్, 711.13 కిలో మీటర్లు ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

Advertisement

Also Read: Holi Festival: తెలంగాణలో హోలీ సంబరం.. ఊరూరా భక్తిశ్రద్ధలతో కాముని దహనం!

గుత్తేదారులు పాల్గొనలేదనే ప్రచారం

అందుకోసం టెండర్లు పిలిచారు. కానీ ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదని సమాచారం. టెండర్లలో పేర్కొన్న ధరతో గిట్టుబాటు కాదని భావించి గుత్తేదారులు పాల్గొనలేదనే ప్రచారం జరుగుతుంది. టెండర్లలో పాల్గొన్నవారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి గ్యారెంటీ ఉండదు. 15 ఏళ్లపాటు సదరు కంపెనీ నిర్వహణ బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా ముందుకు రాలేదని సమాచారం. ఈ ప్రాజెక్టును 3 దశల్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశ పనులను 2026 జనవరిలో, రెండోదశ పనులను 2026 మార్చిలో, మూడో దశ పనులను 2026 జూన్​లో ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ టెండర్ దారులు ఎవరు ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదని సమాచారం. ఇది ఇలా ఉంటే హామ్ పనుల పర్యవేక్షణ కోసం పీఆర్​ ఇంజినీరింగ్ హెడ్ ఆఫీస్ లో ప్రత్యేక అధికారి నియమించారు. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగాన్ని నోడల్ విభాగంగా నియమిస్తూ, కన్వీనర్ గా ఈఎన్సీ పంచాయతీ రాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

2,500కు పైగా ఆవాస గ్రామాల్లో ప్రజలు నరకయాతన

Advertisement

ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో 334 పంచాయతీలకు నేటికీ రహదారి సౌకర్యం లేదని సమాచారం. దీంతో 2,500కు పైగా ఆవాస గ్రామాల్లో ప్రజలు నరకయాతన పడుతున్నారు. వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం హామ్ పద్దతిలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని భావించినప్పటికీ ఆదిలోనే టెండర్ దశలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ఆ అరిష్టాలను ఎలా అదిగమిస్తారనేది చూడాలి. ఇక మిగిలిన రోడ్లు సీఆర్ఆర్, పీఎంజీఎస్‌వై నిధులతో చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం హామ్ రోడ్ల నిర్మాణాలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఇప్పడు హాట్ టాపిక్ అయింది.

Also Read: Vizag Bus Fire: వైజాగ్‌లో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన బస్సు

Related News

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

Big Stories

Advertisement
×