E-Paper
Advertisement

‘హిట్లర్’ చుట్టూ రాజకీయాలు.. కేటీఆర్‌కు సామ స్ట్రాంగ్ కౌంటర్, వేలెత్తి చూపే ముందు..

‘హిట్లర్’ చుట్టూ రాజకీయాలు.. కేటీఆర్‌కు సామ స్ట్రాంగ్ కౌంటర్, వేలెత్తి చూపే ముందు..
Advertisement

Hyderabad: సోషల్‌మీడియా బలంగా ఉన్న ఈ రోజుల్లో నేతలు వెరైటీగా ఏం మాటలు ఆడినా వెంటనే రియాక్ట్ అవుతున్నారు ప్రత్యర్థులు. క్షణాల్లో గతంలోని వీడియోలు బయటపెడుతున్నారు.  కేటీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్ మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అసలు మేటరేంటంటే..

‘హిట్లర్’ చుట్టూ తెలంగాణ రాజకీయాలు

Advertisement

రెండురోజుల మీడియా ఈవెంట్‌లో సీఎం రేవంత్‌‌రెడ్డి కొత్త విషయాలు ప్రస్తావించారు. హిట్ల‌ర్ ఫేవ‌రేట్ పదం హైడ్రా అని అన్నారు. హిట్లర్ చెప్పిన పదాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని హైడ్రా పేరిట కొత్త వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ సిటీలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించేందుకు రేవంత్ సర్కార్ హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెల్సిందే.

సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కోట్లాది మందిని ఊచకోత కోసిన క్రూరుడు.. రాక్షసుడు నీకు రోల్ మోడలా? ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. మానవజాతి చరిత్రలో నరమేథం సృష్టించిన హిట్లర్, నీకు ఆదర్శమని చెప్పడానికి సిగ్గనిపించలేదా? అంటూ కాసింత ఘాటు విమర్శలు చేశారు.

Advertisement

కేటీఆర్‌కు సామ స్ట్రాంగ్ కౌంటర్.. వేలెత్తి చూపే ముందు ఒక్కసారి చూసుకో

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్ మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మరో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారని రాసుకొచ్చారు. గతంలో తనని తానే హిట్లర్ అని ప్రకటించుకున్న తన తండ్రి కేసీఆర్‌ను హటావో తెలంగాణ.. బచావో అని అర్థం వచ్చేలా పిలుపు నిచ్చారు కేటీఆర్.

ఇంకోసారి ఇతరులను వేలెత్తి చూపే ముందు.. నీ వీపు చూసుకో కేటీఆర్. వక్రీకరణ మానుకుని వ్యక్తిత్వం పెంచుకో అంటూ ఎక్స్ వేదికగా సూచన చేశారు. చివరలో జై తెలంగాణ…జై జై తెలంగాణ అంటూ ప్రస్తావించారు. ఇంతకీ గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏమన్నారు? దొంగల పాలిట, తప్పుడు పైరవీలు చేసివారి పట్ల కేసీఆర్ హిట్లరేనని వ్యాఖ్యానించిన వీడియో బయటపెట్టారు.  ఆనాడు కేసీఆర్ మాటల వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ALSO READ:  గులాబీ బాస్‌కు సొంత లీడర్ల సెగ.. పార్టీని ముంచుతున్న పోకడలు

 

Related News

తెలంగాణ ఇష్యూ ఢిల్లీకి.. BRS నేతల భారీ ప్లాన్!

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..?

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దుర్గం చెరువు 2 రోజులు క్లోజ్!

పోలీసుల ముందుకు కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్… ఆ ముగ్గురితో లింకులపై ఆరా!

సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!

Big Stories

Advertisement
×