E-Paper
Advertisement

Rangareddy District: నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసిన వీధి కుక్కలు

Rangareddy District: నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసిన వీధి కుక్కలు
Advertisement

Rangareddy District: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హైదర్షాకోట్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో వీధి కుక్కలు మరోసారి పంజా విసిరాయి. బుధవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల వేదాంత్ రెడ్డి అనే బాలుడిపై నాలుగు వీధి కుక్కలు గుంపుగా ఒక్కసారిగా దాడి చేశాయి. బాలుడు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ..  కుక్కలు వదలకుండా అతడిని కిందకు పడేసి శరీరంపై విచక్షణా రహితంగా కరిచాయి.

కుక్కల దాడిలో వేదాంత్ రెడ్డి తల, మెడ,  శరీర భాగాలపై తీవ్రమైన గాయాలయ్యాయి. బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కలను వెళ్లగొట్టారు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడిని తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఐసీయూలో ఉంచి బాలుడికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

Advertisement

ఈ ఘటనతో శాంతినగర్ కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి. గతంలో కూడా ఇదే ప్రాంతంలో కుక్కల దాడులు జరిగినట్లు స్థానికులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా..  వీధి కుక్కల బెడదను అరికట్టడంలో వారు విఫలమయ్యారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలను బయటకు పంపాలంటేనే భయం వేస్తోందని..  తక్షణమే అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి తమను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ: Bengaluru: న్యూ ఇయర్ హంగామా.. అమ్మాయిలు తప్పతాగి రోడ్లపై హల్‌చల్

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×