E-Paper
Advertisement

Uttam Kumar: కేసీఆర్, హరీష్ చెప్పేవన్నీ అబద్దాలే.. ఆధారాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్

Uttam Kumar: కేసీఆర్, హరీష్ చెప్పేవన్నీ అబద్దాలే.. ఆధారాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్
Advertisement

Uttam Kumar: గత ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించడం వల్ల జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో అనేక కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అడ్డంకులను అధిగమించడానికి ప్రాజెక్టును రీ-డిజైన్ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుపై నిజమైన చిత్తశుద్ధి లేదని విమర్శిస్తూ, నిధుల మళ్లింపు, ప్రణాళికా లోపాలను ఆయన ఎత్తిచూపారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టు సమగ్ర నివేదిక (DPR) కోసం జీవో నెంబర్ 69 జారీ చేసి, పనుల్లో పారదర్శకతకు శ్రీకారం చుట్టారు.

అంతేకాకుండా కృష్ణా నది బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణకే ఎక్కువ పరీవాహక ప్రాంతం ఉన్నప్పటికీ, గతంలో సరైన వాటా దక్కలేదని మంత్రి గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీలలో తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల నికర జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడమే లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం సుమారు రూ. 55,080 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ సిద్ధం చేశామని, కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే రూ. 10 వేల కోట్ల నిధులను ఈ ప్రాజెక్టు కోసం సమీకరించామని వెల్లడించారు.

Advertisement

ప్రాజెక్టు పరిధిని విస్తరిస్తూ ఆయకట్టును 10 లక్షల ఎకరాల నుండి 12.30 లక్షల ఎకరాలకు పెంచడం గమనార్హం. దీనివల్ల 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రైతులకు సాగునీరు అందనుంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 7 లక్షలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5 లక్షలు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కేవలం సాగునీరే కాకుండా, మొత్తం 70 మండలాల్లోని 1226 గ్రామాలకు తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. దీనివల్ల నాగర్ కర్నూల్, నారాయణ్ పేట, వికారాబాద్ జిల్లాల రైతులకు పండగలాంటి వార్త ఇది.

Also Read: దమ్ముంటే కొనండి.. లేదంటే మానేయండి! ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లపై ‘టాక్స్’ టెర్రర్

Advertisement

పనుల పురోగతి విషయానికి వస్తే, నార్లాపూర్, ఏదుల, వట్టేం, కరివెన రిజర్వాయర్ల పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి కావచ్చాయని, కరివెన రిజర్వాయర్ పనులు 75 శాతానికి చేరుకున్నాయని మంత్రి వివరించారు. ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లను కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టును అన్ని అనుమతులతో, పక్కా ప్రణాళికతో పూర్తి చేసి తీరుతామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×