E-Paper
Advertisement

Telangana: మా పెన్షన్ బకాయిలు ఏవి? అసెంబ్లీ ముట్టడికి యత్నించిన రిటైర్డ్ ఉద్యోగులు అరెస్ట్

Telangana: మా పెన్షన్ బకాయిలు ఏవి? అసెంబ్లీ ముట్టడికి యత్నించిన రిటైర్డ్ ఉద్యోగులు అరెస్ట్
Advertisement

Telangana: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు రావాల్సిన పెన్షన్ బకాయిలు, ఇతర ప్రయోజనాల కోసం రిటైర్డ్ ఉద్యోగులు ‘అసెంబ్లీ ముట్టడి’కి పిలుపునిచ్చారు. సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వ సేవలో ఉండి, విశ్రాంత జీవనం గడుపుతున్న తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఉద్యోగ సంఘాల నేతలను, పెన్షనర్లను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు.

పెండింగ్ డీఏల వివాదం
అయితే ప్రధానంగా 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న DA బకాయిలను తక్షణమే విడుదల డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో రోడ్డెక్కక తప్పలేదని పేర్కొంటున్నారు. బకాయిల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యం వల్ల వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయని, తమ గోడును అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి వినిపించాలన్న ఉద్దేశంతో ఈ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు వెల్లడించారు.

Advertisement

అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నగరంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన బక్క జడ్సన్‌తో పాటు పలువురు రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా నిరసనకారులను అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం అణచివేస్తోందని, అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని ఈ సందర్భంగా ఉద్యోగ నేతలు స్పష్టం చేశారు.

Also Read: తీవ్ర విషాదం.. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని జూనియర్ డాక్టర్ మృతి..

Advertisement

ప్రభుత్వ స్పందన కోరుతున్న బాధితులు
అయితే పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే పెన్షన్ మాత్రమే తమకు జీవనాధారమని, అటువంటి పెన్షన్ విషయంలో, బకాయిల చెల్లింపులో జాప్యం చేయడం తగదని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×