E-Paper
Advertisement

Keesara Robbery: కీసర జ్యువెలరీ షాపు దోపిడీ కేసు.. గొడ్డలితో దాడి చేసిన ఆ ఇద్దరు అరెస్ట్

Keesara Robbery: కీసర జ్యువెలరీ షాపు దోపిడీ కేసు.. గొడ్డలితో దాడి చేసిన ఆ ఇద్దరు అరెస్ట్
Advertisement

Keesara Robbery: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ జ్యువెలర్స్ షాపులో జరిగిన సంచలన దోపిడీ యత్నం కేసును మల్కాజిగిరి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. షాపు యజమానిపై పాశవికంగా దాడి చేసి పరారైన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

జనవరి 2, 2026న నాగారం సత్యనారాయణ కాలనీ, రంపల్లి ఎక్స్ రోడ్స్ సమీపంలోని బాలాజీ జ్యువెలర్స్‌లో పట్టపగలే ఈ దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కస్టమర్ల మాదిరిగా నమ్మించి షాపులోకి ప్రవేశించారు. అదును చూసి వెంట తెచ్చుకున్న నకిలీ తుపాకీ (డమ్మీ గన్) గురిపెట్టి యజమాని సందీప్‌ను బెదిరించారు. డబ్బు, బంగారం ఇవ్వాలంటూ గొడ్డలితో సందీప్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు.

Advertisement

అయితే, ప్రాణాలకు తెగించి యజమాని సందీప్ దుండగులను ప్రతిఘటించారు. ఆయన ధైర్యానికి భయపడిన దుండగులు.. దోపిడీ సాధ్యంకాదని భావించి ఏమీ ఎత్తుకెళ్లకుండానే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ గొడవలో సందీప్ తీవ్రంగా గాయపడ్డారు, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మొత్తం దృశ్యాలు షాపులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.వేట:

ఘటనపై కేసు నమోదు చేసుకున్న మల్కాజిగిరి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. దుండగులు వచ్చిన బైక్ నెంబర్, వారు వెళ్లిన మార్గాలను విశ్లేషించి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల ఆచూకీ కనిపెట్టి, వారిని అదుపులోకి తీసుకున్నారు. జల్సాలకు అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Advertisement

Read Also: తీవ్ర విషాదం.. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని జూనియర్ డాక్టర్ మృతి..

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×