E-Paper
Advertisement

సోషల్ మీడియాను కుదిపేస్తున్న 1980s ట్రెండ్, అచ్చం హీరోలా సీఎం రేవంత్, ఓల్డ్ ఈజ్ గోల్డ్

సోషల్ మీడియాను కుదిపేస్తున్న 1980s ట్రెండ్, అచ్చం హీరోలా సీఎం రేవంత్, ఓల్డ్ ఈజ్ గోల్డ్
Advertisement

Hyderabad: సోషల్ మీడియాను ఓ కుదుపు కుదిపేస్తోంది 1980s ట్రెండ్. ఇప్పుడు రాజకీయ నేతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కుర్రకారు నుంచి ప్రముఖుల వరకు ఆనాటి క్లాసిక్ లుక్‌లో ఉంటే ఎలా ఉంటారో ఏఐ సాయంతో క్రియేట్ చేసుకుని నెట్టింట షేర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి సంబంధించిన వింటేజ్ లుక్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అచ్చం హీరోలా మాదిరిగా దర్శనమిచ్చారు.

సోషల్ మీడియాను కుదిపేస్తున్న 1980s ట్రెండ్

సోషల్ మీడియాలో ట్రెండ్ మారుతోంది. కేవలం కొత్తవాటికి సంబంధించినవి కాకుండా.. అప్పుడు పాత వాటిని తిరగేస్తున్నారు. ఈ క్రమంలో 1980 నాటిని స్టయిల్స్‌లో రాజకీయ నేతల ఫోటోలు తెగ తిరిగేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా లుక్‌లో నేతల ఫోటోలు దర్శనమిస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, తన 1980 నాటి ఫోటోను బయటపెట్టారు.

హీరోలా సీఎం రేవంత్, ఫ్యామిటీ నటుడిగా కిషన్‌రెడ్డి

Advertisement

లైట్‌గా బెల్ ప్యాంట్, దానికి తగ్గట్టుగా షూ, బ్లేజర్, ఓల్డ్ ఫ్యాషన్ షర్టు, హెయిర్‌కు తగ్గట్టుగా గడ్డం వంటివి అందులో ఉన్నాయి. అప్పట్లో యువత.. హీరోల పోస్టర్ల వద్ద ఫోటోలు తీసుకునేవారు. అదే స్టయిల్ లో కనిపిస్తోంది. యూత్ అతిగా ఇష్టడే యమహా బైక్, ఆ తర్వాత టేప్ రికార్డర్, బ్యాక్ డ్రాప్‌లో సినిమా పోస్టర్లు చూస్తే.. ఆనాడు యువత ఈ విధంగా ఉండేవాళ్లా అంటూ చర్చించుకోవడం అప్పుడే మొదలైంది. టెక్నాలజీ లేని రోజుల్లోనూ ఫ్యాషన్‌కు ఏ విధంగా తీసిపోకుండా అప్పటి యువత తయారు అయ్యేదని అంటున్నారు.

గోయింగ్ విత్ ది ట్రెండ్ 1980.. విత్ మై బ్రదర్ రేవంత్ రెడ్డి గారు అంటూ కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ చామల ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. సీఎం లుక్ చూసిన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, మా సీఎం హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నారంటూ రాసుకొస్తున్నారు.

Advertisement

ALSO READ: అదుపు తప్పిన లారీ.. డ్రైవర్‌ సహా 200 గొర్రెలు సజీవదహనం.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. ఆయన కూడా 80 ల్లో ఫ్యామిలీ హీరోలా కనిపించారు. ఆయా ఫొటో చూసిన నెటిజన్లు హ్యాండ్సమ్ పొలిటీషియన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే నాయకులు ఏఐ ట్రెండ్‌లో భాగమై పాతకాలపు స్టయిల్స్‌ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇక మాజీ కేంద్రమంత్రులు  శశిథరూర్, దివంగత నేత ఎర్రన్నాయుడు కూడా అదిరిపోయారు. బ్లాక్ కళ్ల అద్దాలు, ఆనాటి స్టయిల్‌లో టీడీపీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నారు.

 

Related News

అదుపు తప్పిన లారీ.. డ్రైవర్‌ సహా 200 గొర్రెలు సజీవదహనం.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం

మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

ఏఐసీసీలో తెలంగాణకు ప్రయార్టీ.. మధుయాష్కీకు కీలక పదవి, ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ హైకమాండ్ నియామకం

పోలీస్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ న్యూస్ మీకోసమే

పెద్ద కూతురు పెళ్లి కోసం.. కన్న బిడ్డను అమ్ముకోవాలనుకున్న తల్లి.. ఎక్కడంటే?

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. అసెంబ్లీకి ఇద్దరు సీనియర్ నేతలు దూరం?

సిటీలో స్వచ్ఛమైన నీటిలో గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటున్నారా.. అయితే ఇక్కడికి రండి?

Big Stories

Advertisement
×