Bigg boss 10:బిగ్ బాస్ (Bigg Boss 10) తెలుగు సీజన్ 10 అలా ప్రారంభమైందో లేదో అప్పుడే మొదటి వారానికి సంబంధించిన నామినేషన్స్ హడావిడి పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా ఆడియన్స్ ఓట్లను బట్టి చూస్తే సృష్టి, యాంకర్ సుధీర్ రెడ్డి ఒక శాతం ఓటింగ్ తో లీస్ట్ లో ఉంటూ ఎలిమినేషన్ కి దగ్గరగా నిలిచారు. అయితే అనూహ్యంగా ఓట్లల్లో తారు మారు జరగడంతో కామనర్ ఆర్జే చరణ్ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ జే చరణ్ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తుండడంతో.. ఏంట తొలివారమే మిడ్ వీక్ ఎలిమినేషనా? అని ఒకరు కామెంట్ చేస్తే.. ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. మరొకరు ఇది ఫేక్ అంటూ ఎవరికి వారు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
6 మంది అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. పదిమంది సెలబ్రిటీలు హౌస్ లోకి వచ్చారు. అలా మొత్తం 16 మంది హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టారు. బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం అయిన తొలివారమే ఎలిమినేషన్ ప్రక్రియ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. సాధారణంగా వారం మొదటి రెండు రోజుల్లో నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది.. ఆ తర్వాత ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్స్ వేస్తారు. చివరిగా వారాంతంలో శనివారం.. హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి.. హౌస్ మేట్స్ ఆట తీరు గురించి ఎవరైనా తప్పు చేస్తే క్లాస్ తీసుకోవడం, కొన్ని గేమ్స్ ఆడించడం లాంటివి చేస్తారు.ఇక నామినేషన్స్ లో ఉన్న వారిని ఒక్కొక్కరిగా సేవ్ చేస్తూ చివరిగా ఓట్లు పడని వారిని ఎలిమినేట్ చేస్తారు. శని, ఆదివారాల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఎప్పటిలాగే ఈ సీజన్లో ఏకంగా 16 మంది నామినేషన్ లోకి వచ్చేసారు. కానీ ఈ సారి కంటెస్టెంట్స్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరిగిందని తెలుస్తోంది.
హౌస్ మేట్స్ ఛాయిస్ ఓటింగ్ లో ఆటో రాంప్రసాద్ (Auto Ram Prasad), ఆర్ జె చరణ్ (RJ. Charan) మధ్య పోటీ జరిగిందని , ఆ ఇద్దరికి మిగిలిన హౌస్ మేట్స్ ఓట్లు వేయాల్సి ఉంటుందట. దాంతో రామ్ ప్రసాద్ కి ఎక్కువగా ఓట్లు వేయడంతో చరణ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడని సమాచారం. కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన చరణ్ మహదేవ్ తొలివారమే ఇలా మిడ్ వీక్ లోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది.మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. శని లేదా ఆదివారం ఎపిసోడ్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఏది ఏమైనా చరణ్ ఎలిమినేషన్ అంటూ వస్తున్న వార్తలు మాత్రం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ALSO READ:పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
10 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. వీరిలో సీరియల్ నటి దేబ్జానీ మోదక్, ఆదిత్ అరుణ్ ,సింగర్ ఝాన్సీ, యాంకర్ సుధీర్ రెడ్డి, అమన్ మసూద్ , రాంప్రసాద్, నరేష్ , ఆర్ జె చరణ్, షాలిని, చైత్ర రాయ్ , టెంపర్ వంశీ , సృష్టి వ్యాకరణం , కృష్ణుడు, వర్షిని, రోహిత్ నాయుడు, ముఖేష్ గౌడ ఇలా మొత్తం 16 మంది అడుగు పెట్టారు..