Mahabubnagar district: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గొర్రెల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 200కు పైగా గొర్రెలు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాయి. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూత్పూర్ వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి కర్నూలుకు మేకల లోడ్‌తో వేగంగా వెళ్తోంది ఓ లారీ. ఒక్కసారిగా అదుపు తప్పి లారీ, రోడ్డు పక్కనున్న రెయిలింగ్, సూచిక బోర్డును బలంగా ఢీకొట్టింది. దీంతో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రమాద తీవ్రతకు డ్రైవర్ స్పాట్‌లో సజీవ దహనమయ్యాడు. లారీలో ఉన్న దాదాపు 200 మేకలు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాయి. ప్రమాదం తీవ్రతకు లారీ ఇంధన ట్యాంక్ పగిలిపోవడంతో క్షణాల్లో మంటలు చెలరేగి వ్యాపించాయి. డ్రైవర్ తేరుకునే లోపు మంటల్లో ప్రాణాలు కోల్పోయాడు. వాహనం వెనుక భాగంలో సుమారు 100కు పైగా గొర్రెలు మంటల్లో చిక్కుకున్నాయి.
అవి బయటకు రాలేక అవి కూడా మంటల్లో కాలి బూడిదయ్యాయి. నిమిషాల వ్యవధిలో లారీ అంతా పూర్తిగా దగ్ధమైంది. తీవ్రంగా గాయపడిన క్లీనర్ ను స్థానికులు కాపాడారు. వెంటనే 108 అంబులెన్స్ కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రిలో క్లీనర్ ట్రీట్ మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఘటన గురించి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన తర్వాత ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వాహనాన్ని పక్కకు తొలగించి క్లియర్ చేశారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ALSO READ: మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
లారీలో మంటలు.. డ్రైవర్ సజీవదహనం
TG: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి కర్నూలుకు మేకల లోడ్‌తో వేగంగా వెళ్తున్న లారీ, అదుపుతప్పి రోడ్డుపై ఉన్న సూచిక బోర్డును బలంగా ఢీకొట్టింది. దీంతో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి… pic.twitter.com/ProfMG5Fbv
— BigTV APP (@BigtvApp) September 10, 2026