Future City: ఇబ్రహీంపట్నంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో సీఎంతో పాటు ఈ కార్యక్రమానికి శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీజీపీ సీవీ ఆనంద్, ఉన్నతాధికారులు పాల్టోన్నారు.
కార్యక్రమ అనంతరం ఇబ్రహీంపట్నం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలు దేరారు. అనంతరం భారత్ ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. NIUM క్యాంపస్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.
Also read: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై భట్టి సంచలన ఆదేశాలు.. వెనుకబడిన శాఖలపై ఫోకస్!