E-Paper
Advertisement

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తల్లీకూతుళ్ల చోరీలు.. రూ. 10.60 లక్షల సొత్తు స్వాధీనం!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తల్లీకూతుళ్ల చోరీలు.. రూ. 10.60 లక్షల సొత్తు స్వాధీనం!
Advertisement

Railway Theft: రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని చేతివాటం చూపిస్తున్న ఒక తల్లీకూతుళ్ల ముఠా గుట్టును సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు రట్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన జమునా బ్యాధ్, మాలతి బ్యాధ్ అనే ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి, వారి నుంచి దాదాపు రూ. 10.60 లక్షల విలువైన 70 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

వైద్యం పేరుతో నగరానికి వచ్చి..

Advertisement

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. భర్త వైద్య చికిత్స కోసం ఈ తల్లీకూతుళ్లు గతేడాది జూలైలో హైదరాబాద్‌కు వచ్చారు. గచ్చిబౌలిలో ఒక అద్దె గది తీసుకుని, సమీపంలోని ఏఐజీ (AIG) ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడంతో మళ్లీ దొంగతనాల బాట పట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో కూడా వీరు పశ్చిమ బెంగాల్‌లో పలు ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

స్కెచ్ ఇలా..

Advertisement

రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లను, ముఖ్యంగా ప్రయాణికులు రైళ్లు ఎక్కే సమయాన్ని వీరు టార్గెట్ చేసేవారు. మహిళా ప్రయాణికులపై కన్నేసి, వారి హ్యాండ్‌బ్యాగులు, లగేజీ బ్యాగుల జిప్పులు చాలా చాకచక్యంగా తెరిచి బంగారం, విలువైన వస్తువులను మాయం చేసేవారు. సికింద్రాబాద్ పరిధిలో నమోదైన రెండు వేర్వేరు చోరీ కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయింది.

అనుమానమే పట్టించింది!

సికింద్రాబాద్ ప్లాట్‌ఫామ్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది సమన్వయంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. తాము చేసిన నేరాలను నిందితులు అంగీకరించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రయాణికులు తమ లగేజీ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Also Read: కర్నూలులో హైడ్రామా.. తొడ కొట్టి, మీసం తిప్పి టీడీపీకి హఫీజ్ ఖాన్ సవాల్!

Tags

Related News

తెలంగాణలో పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన బీజేపీ నేతలు!

ఇంటిపై యూట్యూబ్ లోగో వేయించుకొని.. లక్షల్లో సంపాదిస్తున్న యువత!

కేటీఆర్ కన్ను పడితే మటాషే.. బల్మూరి వెంకట్ సంచలనం!

ఈఎస్‌ఐ పీఠంపై కన్ను.. ఎంపీ, మంత్రి కార్యాలయాల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు

మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే దళారులకే అమ్ముకోండి.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు!

‘తెలంగాణ ఎండిపోతుంటే నీకేం పని అక్కడ’? సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ రాంచందర్ రావు!

కేటీఆర్.. ఆ సుద్దపూస మాటలు బంద్ చేయ్! మీ తప్పులు ప్రజలకు తెలుసు: ఎంపీ చామల

Big Stories

Advertisement
×