E-Paper
Advertisement

ఇంటిపై యూట్యూబ్ లోగో వేయించుకొని.. లక్షల్లో సంపాదిస్తున్న యువత!

ఇంటిపై యూట్యూబ్ లోగో వేయించుకొని.. లక్షల్లో సంపాదిస్తున్న యువత!
Advertisement

YouTube Earnings: యూట్యూబ్‌లో వీడియోలు చూడటం చాలామందికి అలవాటు. కానీ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పారాజుపల్లి గ్రామ యువత మాత్రం వీడియోలు చూడటమే కాదు.. సొంతంగా వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. తమకు నచ్చిన విషయాలపై వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెడుతున్నారు. ఇలా ఒక్కొక్కరుగా మొదలుపెట్టిన ఈ ప్రయత్నం.. ఇప్పుడు గ్రామంలో చాలామంది యువతకు ఆదాయ మార్గంగా మారింది.

కొత్త కొత్త ఆలోచనలతో..

అప్పారాజుపల్లి యువత రకరకాల వీడియోలు చేస్తున్నారు. తమ రోజువారీ పనులు, కుటుంబ విషయాలు, కొత్త కొత్త ఆలోచనలను వీడియోలుగా తీసి ప్రేక్షకులకు చూపిస్తున్నారు. విక్కీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్, వైఫ్ ఆఫ్ ప్రణయ్, అశ్విని వ్లాగ్స్, కొత్త పోరడు, OG సంజు వంటి యూట్యూబ్ ఛానళ్ల ద్వారా తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీడియోలకు మంచి ఆదరణ రావడంతో కొందరు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నట్లు చెబుతున్నారు.

Advertisement

Also read: నీలగిరి మౌంటైన్ రైల్వే అలర్ట్.. మెట్టుపాళయం–ఊటీ రైళ్లు రద్దు, ఎందుకంటే?

ఇంటిపై యూట్యూబ్ లోగో..

సాధారణంగా చాలామంది మొబైల్‌లో వీడియోలు చూస్తూ సమయం గడుపుతుంటారు. కానీ అప్పారాజుపల్లి యువత మాత్రం అదే మొబైల్‌ను సంపాదనకు ఉపయోగిస్తున్నారు. తమ పనులు చేసుకుంటూనే వీడియోలు తీస్తున్నారు. యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుతో కొందరు ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. తమ విజయానికి గుర్తుగా ఇంటిపై యూట్యూబ్ లోగోను ఏర్పాటు చేసుకున్నారు. ఇలా గ్రామంలో చాలామంది యువత యూట్యూబ్ ద్వారా ఆదాయం సంపాదిస్తూ ముందుకు సాగుతున్నారు.

చిన్న ఫోన్‌తోనే..

Advertisement

మొత్తానికి.. చేతిలో ఉన్న చిన్న ఫోన్‌తోనే తమ జీవితాల్లో మార్పు తెచ్చుకుంటున్నారు అప్పారాజుపల్లి యువత. తమకు వచ్చిన ఆలోచనలతో వీడియోలు చేస్తూ.. కష్టపడి ఆదాయం సంపాదిస్తున్నారు. మన దగ్గర ఉన్న అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మనం కూడా ముందుకు వెళ్లొచ్చని ఈ యువత నిరూపిస్తున్నారు. చేయాలనే ఆసక్తి.. కష్టపడే మనస్తత్వం ఉంటే మన టాలెంట్‌తో మనమే ఎదగొచ్చని అప్పారాజుపల్లి యువత చాటిచెబుతున్నారు.

Also read: సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు కారణాలు ఇవే!

Tags

Related News

తెలంగాణలో పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన బీజేపీ నేతలు!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తల్లీకూతుళ్ల చోరీలు.. రూ. 10.60 లక్షల సొత్తు స్వాధీనం!

కేటీఆర్ కన్ను పడితే మటాషే.. బల్మూరి వెంకట్ సంచలనం!

ఈఎస్‌ఐ పీఠంపై కన్ను.. ఎంపీ, మంత్రి కార్యాలయాల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు

మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే దళారులకే అమ్ముకోండి.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు!

‘తెలంగాణ ఎండిపోతుంటే నీకేం పని అక్కడ’? సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ రాంచందర్ రావు!

కేటీఆర్.. ఆ సుద్దపూస మాటలు బంద్ చేయ్! మీ తప్పులు ప్రజలకు తెలుసు: ఎంపీ చామల

Big Stories

Advertisement
×