E-Paper
Advertisement

మీ నేతలు తోసేస్తే.. ప్రభుత్వంపై నిందలా? BRS మహిళా నేతలకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

మీ నేతలు తోసేస్తే.. ప్రభుత్వంపై నిందలా? BRS మహిళా నేతలకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!
Advertisement

Seethakka Allegations: సొంత పార్టీ మహిళ ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దుర్మార్గంగా, అనుచితంగా ప్రవర్తించారని మంత్రి సీతక్క ఆరోపించారు. దీనికి సంబంధించిన విజువల్స్ ను ఆమె విడుదల చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి కోవలక్ష్మిని వెనక నుండి గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి తోశారని అన్నారు. ముఖ్యంగా గుంగుల కమలాకర్ వెనుక నుంచి మహిళా ఎమ్మెల్యేలను నెట్టుకుంటూ ముందుకు వచ్చారన్నారు.

పక్కపక్కనే నిలుచున్న ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్యలోకి తాకుకుంటూ రావాల్సిన అవసరం సుధీర్ రెడ్డికి ఏముందని సీతక్క ప్రశ్నించారు. కోవా లక్ష్మీ, సబితా ఇంద్రారెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అనుచితంగా వ్యవహరించారన్నారు. నవీన్ రెడ్డి నెట్టుకుంటూ పోయినపుడు ఆ మహిళా ఎమ్మెల్యేలు అయ్యో అని అరిచారన్నారు. వెనుక నుంచి తోసిన గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డిలది కీచకపర్వమంటూ సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని సీతక్క అభిప్రాయపడ్డారు.

Advertisement

Also Read: మగ పోలీసులు తోసేశారు.. కిందపడితే తొక్కేశారు.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఆవేదన

ఇదిలా ఉంటే అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఉద్రిక్తతల్లో గాయపడ్డ మహిళా పోలీసులను మంత్రి సీతక్క మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మంత్రిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మంత్రికి చూపించి.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న తమపై బీఆర్ఎస్ నేతలు అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడికి పాల్పడ్డారని బాధితులు మంత్రికి తెలియజేశారు.

Advertisement

Also Read: అసెంబ్లీలో సంచలనం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా.. 18 మంది BRS ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు!

Tags

Related News

కేసీఆర్ ఆరోగ్యంపై చిల్లర రాజకీయాలా? హరీశ్ రావు గుట్టు విప్పిన టీపీసీసీ చీఫ్!

మగ పోలీసులు తోసేశారు.. కిందపడితే తొక్కేశారు.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఆవేదన

అసెంబ్లీలో సంచలనం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా.. 18 మంది BRS ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు!

కరెంట్ కష్టాలకు చెక్.. తెలంగాణకే 90 శాతం బొగ్గు.. సింగరేణి బంపరాఫర్!

పాలిటిక్స్ To పర్సనల్.. హద్దులు దాటుతున్న రాజకీయం.. బలవుతున్న కేడర్!

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. సొంత డబ్బు ఇక బ్యాంకులో!

కాంట్రాక్టర్ యమ సేఫ్ ప్లాన్.. ఏసీబీకి చిక్కిన అధికారి.. ఎలా చిక్కారంటే..?

Big Stories

Advertisement
×