E-Paper
Advertisement

బిగ్ బాస్ కి టాలెంట్ అక్కర్లేదా.. రిజెక్ట్ చేయడంతో నిజాలు బయటపెట్టిన రాజకుమారి!

బిగ్ బాస్ కి టాలెంట్ అక్కర్లేదా.. రిజెక్ట్ చేయడంతో నిజాలు బయటపెట్టిన రాజకుమారి!
Advertisement

Bigg Boss 10: వరల్డ్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాలని.. సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా కొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది అని అనౌన్స్మెంట్ ఇచ్చిన రోజు నుంచే.. దాదాపు రెండు నెలల ముందే తమ టాలెంటును ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక సెలబ్రిటీల విషయం కాస్త పక్కన పెడితే.. హౌస్ లోకి అడుగుపెట్టి పాపులారిటీ సంపాదించుకోవాలని చూసే కామనర్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారికి బిగ్ బాస్ అగ్నిపరీక్ష అనే ఒక షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అగ్ని పరీక్ష 2లో రిజెక్ట్ చేయడంపై రాజకుమారి ఎమోషనల్ కామెంట్స్..

ఈ నేపథ్యంలోనే గతంలో లాగానే ఈ సీజన్ కి కూడా అగ్నిపరీక్ష షోకి వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. అందులో కేవలం 10 లేదా 15 మందిని మాత్రమే ఎంపిక చేసి, వారి బలాబలాలను పరీక్షించి ,అందులో సత్తా చాటి , హౌస్ లో ఉండగలరు అనే నమ్మకం కలిగిన తర్వాతనే ఒక ఆరు మందిని హౌస్ లోకి పంపిస్తారు. అయితే ఇక్కడ ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 కోసం కామనర్స్ ఎంపిక విషయంలో అగ్నిపరీక్ష2 లో అన్ ఫెయిర్ సెలక్షన్ జరిగిందనే కామెంట్లు వ్యక్తమైన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు ఈ విషయంపై అగ్నిపరీక్షలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన రాజకుమారి (Raja kumari) కూడా విస్తుపోయే నిజాలు బయటపెట్టింది. హౌస్ లో అడుగు పెట్టడంతోనే జడ్జెస్ ను మెప్పించిన ఈమె.. అనూహ్యంగా రిజెక్ట్ అవడంపై కృంగిపోయింది. అంతేకాదు తనను రిజెక్ట్ చేయడానికి గల కారణాలను కూడా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది రాజకుమారి.

బిగ్ బాస్ కి వెళ్లాలనే ఆలోచన ఎప్పుడు మొదలైంది?

Advertisement

యూట్యూబ్లో వీడియోలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న రాజకుమారి.. ఇప్పుడు అగ్ని పరీక్ష 2 లో రిజెక్ట్ కావడంతో.. వరుసగా పలు ప్రముఖ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఎన్నో విషయాలను బయటపెట్టింది. అందులో భాగంగానే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇంటర్వ్యూయర్ ప్రశ్నిస్తూ.. బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఎంతోమందికి మంచి లైఫ్ ఇచ్చింది. చాలామంది జీవితాలను మార్చేసింది. చాలా మందిని ఒక స్థాయి నుండి ఇంకో స్థాయికి తీసుకెళ్ళింది. మరి బిగ్ బాస్ కి వెళ్లాలనే ఆలోచన మీలో ఎప్పుడు మొదలైంది? అని ప్రశ్నించారు.

also read:ప్రశాంత్ నీల్ హర్రర్ మూవీని రిజెక్ట్ చేసిన CBFC? మరీ అంత డార్క?

నా జీవితంలో వెనక్కి చూసుకుంటే శూన్యం – రాజకుమారి..

Advertisement

రాజకుమారి మాట్లాడుతూ.. మా తాతయ్య నాటకాలు వేసేవారు. అలా స్వతహాగా నాకు చిన్నప్పటి నుంచే నటన మీద ఇష్టం కలిగింది. ముఖ్యంగా సినిమాలలో నన్ను నేను ఊహించుకొనేదాన్ని. నేను పెరిగిన విలేజ్ వాతావరణం లో ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. తర్వాత పెళ్లి, పిల్లలు అన్ని అలా జరిగిపోయాయి. ఇక వెనక్కి చూసుకుంటే నా జీవితంలో నా కోసం నేను గడిపిన రోజులు కనిపించలేదు. అందుకే మొదట టిక్ టాక్ వీడియోలతో నా కెరియర్ మొదలు పెట్టాను. దాన్ని బ్యాన్ చేశారు. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెడితే వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తారు అనుకున్నాను. కానీ చాలామంది నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

నా రంగు వల్ల ఎప్పుడు వ్యతిరేకతే..

దీంతో మరింత ఆసక్తి కలిగింది. అలా వరుసగా ఫిల్టర్లు లేకుండా నేచురల్ గా వీడియోలు చేస్తూ వచ్చాను. అలా 6 నెలల్లో 80 వేలకు పైగా ఫాలోవర్స్ వచ్చారు. అయితే ఆడిషన్స్ కి వెళ్తే మాత్రం నా కలర్ వల్ల నన్ను రిజెక్ట్ చేసేవాళ్ళు. అందుకే బిగ్ బాస్ వేదికపై నా కలర్ కాదు నా టాలెంట్ ఇది అని నిరూపించుకోవాలని అగ్నిపరీక్షకు వెళ్లాను. అక్కడ కూడా నన్ను అవమానించారు .

నా కలర్ చూసి నన్ను రిజెక్ట్ చేశారు?

నీకు బుర్ర లేదు,లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అంటూ ఏవేవో కామెంట్లు చేశారు. చాలా బాధ వేసింది. ఒకరకంగా నా కలర్ వల్లే నన్ను టార్గెట్ చేసి ఇలా మాట్లాడారేమో అని బాధపడ్డాను. మొత్తానికి నన్ను అగ్నిపరీక్ష లోనే రిజెక్ట్ చేశారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రాజకుమారి. ఈమె మాటలు విన్న నెటిజన్స్.. బిగ్ బాస్ షో కి టాలెంట్ అక్కర్లేదా? గుడ్ లుకింగ్స్ , కలర్ ముఖ్యమా ?అనే కామెంట్లు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా రాజకుమారి లాంటి టాలెంటెడ్ అమ్మాయికి ఇక్కడ అవకాశం లభించకపోవడం నిజంగా బాధాకరం అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Related News

బిగ్‌బాస్ హౌస్ గోడ దూకి పారిపోయిన కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి శృతి స్ట్రాంగ్ వార్నింగ్.. బాధపడ్డ మనోజ్.. గుణ దెబ్బకు రోహిణి అవుట్..

Podarillu Today Episode : కన్నాకు టెన్షన్.. మనసు మార్చుకొని మాధవ్.. బాధపడ్డ మనీష..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ దెబ్బకు షాక్.. ప్రేమ పై నర్మద సెటైర్.. శ్రీవల్లికి దిమ్మతిరిగే ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పార్వతికి అనుమానం..నిజం చెప్పిన అక్షయ్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Ninnu kori Serial Today Episode September 9th ‘నిన్నుకోరి’ సీరియల్‌: విరాట్‌కు ప్లాస్టిక్‌ సర్జరీ – ఒంటరిగా ఇంటికి వెళ్లిన చంద్ర

Wedensday Movies in Tv : సినీ ప్రియులకు సూపర్ న్యూస్.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Big Stories

Advertisement
×