E-Paper
Advertisement

అసెంబ్లీలో సంచలనం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా.. 18 మంది BRS ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు!

అసెంబ్లీలో సంచలనం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా.. 18 మంది BRS ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు!
Advertisement

BRS MLAs Suspended: తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న తీవ్ర గందరగోళం నడుమ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సభ సజావుగా సాగేందుకు అడ్డుపడుతున్నారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అసెంబ్లీ సెషన్ మెుత్తానికి సభలో అడుగుపెట్టకుండా సభాపతి వేటు వేశారు.

సస్పెన్షన్ కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కేటీఆర్ తో పాటు హరీశ్ రావు సైతం ఉన్నారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సంజయ్ కుమార్, సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీతా లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ప్రశాంత్ రెడ్డి సస్పెన్షన్ కు గురైన వారి జాబితాలో ఉన్నారు.

Advertisement

Also Read: వందేమాతరంపై మరో వివాదం.. ఈసారి మిత్రపక్షంతో కాంగ్రెస్‌కు పేచి.. విరుచుకుపడ్డ బీజేపీ!

అంతకుముందు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. సభలో గందరగోళం సృష్టిస్తున్న బీఆర్ఎస్ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. శాసన సభ సమావేశాలు సజావుగా జరగనివ్వాలని విజ్ఞప్తి చేశారు. విపక్ష సభ్యులు అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు స్పష్టం చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో గందరగోళం సృష్టించారు. దీంతో శాసనసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పపడ్డాయి. ఫలితంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

Advertisement

మరోవైపు సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల తీరును తీవ్రంగా ఎండగట్టారు. సభాపతికి చేయాల్సిన అవమానాలన్నీ ఆ పార్టీ నేతలు చేశారన్నారు. సభాపతితో పాటు వారి తల్లిని దూషిస్తే.. దళితులు రోడ్లపైకి వచ్చారన్నారు. అయితే వారు నడిచిన రోడ్లను పసుపు నీటితో శుద్ధి చేసి మళ్లీ దళితులను అవమానించారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. విపక్ష నేతల దొరతనం పోకడలను భరించడానికి రాష్ట్రం ఎట్టిపరిస్థితుల్లో సిద్ధంగా లేదని భట్టి విక్రమార్క సభలో చెప్పుకొచ్చారు.

Also Read: అమ్మబాబోయ్.. నూడుల్స్‌లో బతికున్న ఎలుక పిల్ల.. రెస్టారెంట్‌పై కేసు నమోదు!

Tags

Related News

కరెంట్ కష్టాలకు చెక్.. తెలంగాణకే 90 శాతం బొగ్గు.. సింగరేణి బంపరాఫర్!

పాలిటిక్స్ To పర్సనల్.. హద్దులు దాటుతున్న రాజకీయం.. బలవుతున్న కేడర్!

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. సొంత డబ్బు ఇక బ్యాంకులో!

కాంట్రాక్టర్ యమ సేఫ్ ప్లాన్.. ఏసీబీకి చిక్కిన అధికారి.. ఎలా చిక్కారంటే..?

సునీల్ గవాస్కర్ నుంచి నేను నేర్చుకున్నది ఇదే.. అజహరుద్దీన్ సక్సెస్ మంత్ర!

గవర్నర్ వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ బిగ్ అప్డేట్.. సూచనలు చేస్తానని హమీ!

ఇందిరమ్మ టవర్స్‌లో ఎంపిక కాలేదా? మీ డబ్బు ఇలా వాపస్

Big Stories

Advertisement
×