E-Paper
Advertisement

Service Revolver: ఎస్ఐ రివాల్వర్ మిస్సింగ్.. పోలీస్ స్టేషన్‌లో టెన్షన్ టెన్షన్

Service Revolver: ఎస్ఐ రివాల్వర్ మిస్సింగ్.. పోలీస్ స్టేషన్‌లో టెన్షన్ టెన్షన్
Advertisement

Service Revolver: హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఎస్సై భాను ప్రకాష్ సర్వీస్ రివాల్వర్ అదృశ్యం కావడం ఇప్పుడు రాష్ట్ర పోలీసు శాఖలో పెను సంచలనంగా మారింది.

2020 బ్యాచ్‌కు చెందిన భాను ప్రకాష్ రెడ్డి అంబర్‌పేట పీఎస్‌లో క్రైమ్ ఎస్సైగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ (AE), గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో తన తెలంగాణ పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. శాఖాపరమైన వస్తువులను అప్పగించాల్సి ఉంది. అయితే.. తన 9MM సర్వీస్ రివాల్వర్‌ను తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

ఉన్నతాధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎస్సై భాను ప్రకాష్ ఆన్‌లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసై సుమారు కోటి రూపాయల పైగా నష్టపోయినట్లు సమాచారం. ఈ అప్పులు తీర్చడానికి ఆయన ఒక దొంగతనం కేసులో రికవరీ చేసిన 43 గ్రాముల (5 తులాల) బంగారాన్ని బాధితులకు ఇవ్వకుండా తాకట్టు పెట్టారు.తన వద్ద ఉండాల్సిన సర్వీస్ రివాల్వర్‌ను కూడా ఆర్థిక అవసరాల కోసం విక్రయించాడా లేదా తాకట్టు పెట్టాడా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

రివాల్వర్ గురించి ప్రశ్నించగా..  ఆయన పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. మొదట స్టేషన్‌లోనే ఉందని తర్వాత హిమాయత్‌నగర్‌లోని తన నివాసంలో పోయిందని  ఆపై విజయవాడలో పరీక్షకు వెళ్లినప్పుడు లాడ్జీలో ఎవరో ఎత్తుకెళ్లారని చెబుతూ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.

Advertisement

ఈ తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ భాను ప్రకాష్‌ను సస్పెండ్ చేశారు. ఆయనపై క్రిమినల్ నమ్మకద్రోహం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం కింద రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ అదృశ్యమైన తుపాకీ కోసం గాలిస్తున్నారు.

ALSO READ: Srisailam Temple: శ్రీశైలం టెంపుల్ వద్ద యువతి రీల్స్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్.. తీరా సీన్ కట్ చేస్తే…?

Related News

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×