E-Paper
Advertisement

Supreme Court On TG DGP: తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు.. నాలుగు వారాల గడువు

Supreme Court On TG DGP: తెలంగాణ  డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు.. నాలుగు వారాల గడువు
Advertisement

Supreme Court On TG DGP: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు.డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని యూపీఎస్సీ, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో పలు ప్రశ్నలు లేవనెత్తింది. అసలు డీజీపీ శివధర్‌రెడ్డి నియామకం వెనుక అసలేం జరిగింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు

Advertisement

తెలంగాణ డీజీపీ శివధర్ నియామకానికి లైన్ క్లియర్ అయ్యింది. దీనిపై హైకోర్టు తీర్పుని సమర్థించింది సుప్రీంకోర్టు. అయితే డీజీపీ నియామక ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది అత్యున్నత న్యాయస్థానం. శివధర్ రెడ్డి నియామకంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించింది.

పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని యూపీఎస్సీని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను పరిశీలించాలని సూచన చేసింది. అదే సమయంలో ఇన్‌చార్జ్ డీజీపీ నియామకాన్ని తప్పుబట్టలేమని, నియామక ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

Advertisement

నాలుగు వారాల్లో తేల్చాలని యూపీఎస్సీ, తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం

డీజీపీల నియామకం కోసం ప్రతిపాదనలు సమర్పించడంలో రాష్ట్రాలు చేస్తున్న అతి జాప్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల అర్హత కలిగిన సీనియర్ అధికారులు అవకాశాన్ని కోల్పోతారని పేర్కొంది. రాష్ట్రాలు చర్యలు తీసుకోవడంలో విఫలమైతే దరఖాస్తు దాఖలు చేయడానికి UPSCకి అధికారం ఇచ్చింది సుప్రీంకోర్టు.

శివధర్‌‌రెడ్డిని తెలంగాణ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకం చెల్లదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి. సదరు జీవోను కొట్టేయాలంటూ గతేడాది అక్టోబరు 10న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డీజీపీల నియామకంపై సుప్రీంకోర్టు గతంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

ALSO READ: తెలంగాణ గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల

ప్రకాశ్‌సింగ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు ప్రకారం.. తాత్కాలిక పద్ధతిలో డీజీపీని నియమించడానికి వీల్లేదని పిటిషనర్ ప్రధాన వాదన. ఈ వ్యవహారంపై విచారణ జరిపింది హైకోర్టు. డీజీపీగా శివధర్‌ రెడ్డి నియామకానికి సంబంధించిన జీవో కొట్టివేతకు నిరాకరించింది న్యాయస్థానం.

అయితే డీజీపీ ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సదరు పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది సీజేఐ ధర్మాసం. హైకోర్టు తీర్పును సమర్థిస్తూనే.. నాలుగు వారాల్లో పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని యూపీఎస్సీని ఆదేశించింది.

 

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×