E-Paper
Advertisement

NEP Implementation: 2026-27 విద్యాసంవత్సరం నుంచి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ..?

NEP Implementation: 2026-27 విద్యాసంవత్సరం నుంచి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ..?
Advertisement

NEP Implementation: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో యూజీ, పీజీ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ వీ బాలకిష్ట రెడ్డి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించిన ముఖ్యమైన విద్య, విధాన పరమైన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ సమావేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలును ఏకగ్రీవంగా ఆమోదించినట్లు బాలకిష్టారెడ్డి తెలిపారు.

పరిశోధనా వాతావరణం

ఈ నిర్ణయం ద్వారా విద్య నాణ్యతను బలోపేతం చేయడమే కాకుండా నాక్, ఎన్ఐఆర్‌ఎఫ్, ఎన్బీఏ, నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఆర్ఎఫ్‌) వంటి గుర్తింపు, ర్యాంకింగ్ వ్యవస్థల్లో విశ్వవిద్యాలయాలకు మెరుగైన ప్రయోజనాలు లభించడంతో పాటు జాతీయ స్థాయి పోటీ నిధులు, పరిశోధన నిధులను ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. అలాగే విశ్వవిద్యాలయాలలో విద్య, పరిశోధనా వాతావరణాన్ని బలోపేతం చేయడంలో ఇది సహాయపడుతుందని తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల విషయంలో మూడు సంవత్సరాల డిగ్రీకి కనీసం 120 క్రెడిట్లు, నాలుగు సంవత్సరాల హానర్స్ లేదా హానర్స్ విత్ రీసెర్చ్ డిగ్రీకి 160 క్రెడిట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కనీసం 80 క్రెడిట్లు ఉండే విధంగా క్రెడిట్ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించామన్నారు.

యూజీసీ మార్గదర్శకాల ప్రకారం..

Advertisement

అదేవిధంగా మైనర్ డిగ్రీలు, క్రెడిట్ నిర్మాణం, క్రెడిట్ బదిలీ విధానం, మల్టీడిసిప్లినరీ ప్రోగ్రామ్‌లు, మల్టిపుల్ ఎంట్రీ–మల్టిపుల్ ఎగ్జిట్ విధానం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించేందుకు సంప్రదాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సిలబస్ రూపకల్పన, క్రెడిట్ కేటాయింపు, థియరీ, ప్రాక్టికల్స్, ల్యాబ్‌లు, ఇంటర్న్‌షిప్‌, అప్రెంటిస్‌షిప్‌లకు అవసరమైన బోధనా గంటల నిర్ణయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన మార్గదర్శకాలను కూడా సమావేశంలో ఆమోదించినట్లు బాలకిష్టారెడ్డి స్పష్టంచేశారు.

Also Read: Computer Shortage: మూడు కార్పొరేషన్లు సరే.. మరి ఈ పనులు ఎవరు చేయాలి..?

కాకతీయ విశ్వవిద్యాలయానికి..

Advertisement

2026-27 విద్యాసంవత్సరానికి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్(సీపీ గెట్) నిర్వహణ బాధ్యతను వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి అప్పగించినట్లు బాలకిష్టారెడ్డి తెలిపారు. ఐదేళ్ల సమగ్ర కోర్సుల కోసం ప్రత్యేక ప్రవేశ పరీక్షను తగిన సమయంలో నిర్వహించే విషయాన్ని కూడా సూచించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, యూజీసీ సూచనల మేరకు కొత్త, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో కొత్త అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించేందుకు వచ్చిన ప్రతిపాదనలను ఉపకులపతులు ఆమోదించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ వెల్లడించారు.

99 రోజుల కార్యాచరణ

ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల ఏఈడీపీ కార్యక్రమాల విషయంలో విశ్వవిద్యాలయాలు తమ నియమావళి ప్రకారం అనుమతులు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమన్వయం చేస్తుందన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం సాధారణ విద్యా క్యాలెండర్ రూపొందించడంలో విశ్వవిద్యాలయాలు.. ఉన్నత విద్యామండలితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే విద్యాశాఖ జారీ చేసిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విశ్వవిద్యాలయ స్థాయిలో అమలు చేయాలని ఉపకులపతులకు స్పష్​టంచేశారు.

ఈ సమావేశంలో..

ఉన్నత విద్యలో విద్య ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం, అలాగే మండలి, విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ I ప్రొఫెసర్ ఈ పురుషోత్తం, వైస్ చైర్మన్ II ప్రొఫెసర్ ఎస్ కే మహ్మూద్, ఓయూ వీసీ కుమార్ మొలుగారం, కేయూ బీసీ కర్నాటి ప్రతాప్ రెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీ యాదగిరి రావు, మహాత్మాగాంధీ వీసీ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్, పాలమూరు వర్సిటీ వీసీ జీఎన్ శ్రీనివాస్, శాతవాహన విశ్వవిద్యాలయం వీసీ యూ ఉమేశ్ కుమార్, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వీసీ సూర్య ధనంజయ్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ పాల్గొన్నారు.

Also Read: Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. లైసెన్స్ లేకపోతే కటకటాలే!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×