E-Paper
Advertisement

Computer Shortage: మూడు కార్పొరేషన్లు సరే.. మరి ఈ పనులు ఎవరు చేయాలి..?

Computer Shortage: మూడు కార్పొరేషన్లు సరే.. మరి ఈ పనులు ఎవరు చేయాలి..?

Computer Shortage: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని దాదాపు కోటిన్నర మందికి అవసరాలకు తగిన విధంగా అభివృద్దితో పాటు పౌర, అత్యవసర సేవలందిస్తున్న మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో కంప్యూటర్ ఆపరేటర్ల కొరత నెలకొంది. ముఖ్యంగా కొద్ది నెలల క్రితం అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం తర్వాత దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా జీహెచ్ఎంసీ ఏర్పడి, ఆ తర్వాత ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెల్సిందే.

కంప్యూటర్ ఆపరేటర్ల కొరత

పాత జీహెచ్ఎంసీ ఒకే కార్పొరేషన్ గా కొనసాగుతున్న సమయంలోనే అన్ని విభాగాల్లో కలిపి కేవలం మూడున్నర వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, మరో 24 వేల మంది వివిధ విభాగాల ఔట్ సోర్స్ ఉద్యోగులు విధులు నిర్వహించే వారు. పర్మినెంట్ ఉద్యోగుల కంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే మెయిన్ సోర్స్ ఉద్యోగులు మారారు. చాలా విభాగాల్లో కీలకమైన విధులన్నీ వీరే నిర్వహిస్తున్నారు. వీరిలో సుమారు వెయ్యి కి పై చిలుకు కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ఉన్నారు. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే సమయంలో ఒక కార్పొరేషన్ ను మూడు ముక్కలుగా చేస్తున్న సమయంలో సిబ్బంది, స్టాఫ్ ప్యాటన్ కోసం ఎలాంటి ఆలోచన చేయకపొవటంతోనే ఇపుడు మూడు కార్పొరేషన్లలో కంప్యూటర్ ఆపరేటర్ల కొరత నెలకొంది.

ప్రధాన కార్యాలయంలో..

అసలే వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) చివరి మాసం మార్చి నెల కావటంతో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి పాత మొండి బకాయిలు, వర్తమాన సంవత్సర కరెంటు ఏరియర్స్ కు సంబంధించి కనీసం నోటీసులు సిద్దం చేసేందుకు ఆపరేటర్లు లేని పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిన్న మొన్నటి వరకు సెంట్రల్ ట్యాక్స్, ఐటీ, అడ్వర్ టైజ్ మెంట్ విభాగాల్లో నోటీసులు తయారు చేసేందుకు, బిల్లులు క్లియర్ చేసేందుకు ఒకే ఆపరేటర్ కు మూడు బాధ్యతలు అప్పగించారు. పలు కారణాలతో సదరు కంప్యూటర్ ఆపరేటర్ ను శనివారం హఠాత్తుగా చార్మినార్ జోన్ కు బదిలీ చేయటంతో కనీసం ప్రధాన కార్యాలయంలో నోటీసులు తయారు చేసే ఆపరేటర్ లేకుండా పోయారు. ఇతర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు ఈ నోటీసులు ప్రిపేర్ చేసే విధులను కట్టబెట్టడంతో వారు పని భారంతో అల్లాడిపోతున్నట్లు తెలిసింది.

Also Read: Iran President: గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు.. దాడులు చేస్తూ సారీ ఏంటో?

కొత్త కార్పొరేషన్లలో పరిస్థితి మరింత భిన్నం

కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలోనూ జీహెచ్ఎంసీ తరహాలో అన్ని విభాగాల సేవలను ప్రజలకు అందించాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో వీటిని ఏర్పాటు చేశారు. కానీ ఏర్పాటు చేసిన తర్వాత సరి కొత్త కష్టాలు వెంటాడుతున్నట్లు సమాచారం. పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నఔట్ సోర్స్ సిబ్బందిని మూడు కార్పొరేషన్లకు బదిలీ చేసినా, ఒక్కో కార్పొరేషన్ కు కేటాయించిన ఆపరేటర్లు కూడా ఏ మాత్రం సరిపోవటం లేదని తెల్సింది. కొత్తగా ఏర్పాటు చేసిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక్క శానిటేషన్ పనులు అరకొరగా జరగటం మినహా మిగిలిన దోమల నివారణ కోసం ఎంటమాలజీ, వెటర్నరీ, లీగల్, స్పోర్ట్స్, అర్బన్ బయో డైవర్శిటీ వంటి విభాగాల పనులు కూడా ఊపందుకోలేదు.

పరిస్థితి ఇంకా ఘోరం

ఇందుకు సంబంధిత విభాగం హెచ్ఓడీలు ఉన్నా, వారి కింద, ఫీల్డు లెవెల్ లో పని చేసే సిబ్బంది లేకపోవటం, సిబ్బంది జీతభత్యాలు, అటెండెన్స్ లు ప్రిపేర్ చేసి, జీతాల బిల్లు పెట్టే సిబ్బంది లేకపోవటంతో అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మల్కాజ్ గిరి మున్సిపర్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ లో పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైనట్లు సమాచారం. సకాలంలో కనీసం తాగునీరు కూడా సరఫరా కావటం లేదని కొందరు స్థానికులు వాపోతున్నారు. కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, మరి సిబ్బంది సంగతేంటీ అని ప్రశ్నిస్తే స్టాఫ్ ప్యాటన్ తయారు చేస్తున్నామని, త్వరలోనే సర్కారుకు పంపి మంజూరీ తీసుకుంటామని అధికారులు చెప్పుుకొస్తున్నారు.

Also Read: Women Day Special: అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మహిళలకు ఆ బ్యాంకు ప్రత్యేక ఆఫర్

Related News

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Big Stories

×