E-Paper
Advertisement

TG SSC Exams 2026: పదవ తరగతి విద్యార్ధులకు నేరుగా వాట్సప్‌కే హాల్ టికెట్లు

TG SSC Exams 2026: పదవ తరగతి విద్యార్ధులకు నేరుగా వాట్సప్‌కే హాల్ టికెట్లు
Advertisement

TG SSC Exams 2026: రాష్ట్రంలో ఈనెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి. కాగా విద్యార్థుల హాల్ టికెట్లను నేరుగా రిజిస్టర్డ్ నంబర్ల ద్వారా డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. హాల్‌టికెట్లను ఇప్పటికే స్పీడ్ పోస్ట్ ద్వారా సంబంధిత పాఠశాలలకు పంపించినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 2676 పరీక్షా కేంద్రాలు

విద్యార్థులు నేరుగా తమ పాఠశాలల్లో లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా పొందవచ్చన్నారు. www.bse.telangana.gov.in నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అలాగే వాట్సాప్ 8096958096 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపి, ఆపై ‘SSC Hall Ticket March-2026’ అని టైప్ చేయడం ద్వారా కూడా హాల్‌టికెట్ పొందవచ్చని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

Also Read: Air Force Recruitment Rally: తెలుగు యువతకు గుడ్ న్యూస్.. భారత వాయుసేనలో చేరే సువర్ణవకాశం!

ప్రతిరోజు ఉదయం..

సైన్స్, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు మినహా మిగతా పరీక్​షలకు ప్రతిరోజు ఉదయం 09:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగుతాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం హైదరాబాద్‌లోని ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయంలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏదైనా సహాయం లేదా ఫిర్యాదుల కోసం 040-23230942 నంబర్‌ను సంప్రదించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.

Advertisement

Also Read: Storage Tips: గూగుల్ ఫొటోస్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ 5 ట్రిక్స్‌ పాటిస్తే నిమిషాల్లో స్పేస్ ఖాళీ!

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×