Alum For Evil Eye: మన పూర్వీకుల కాలం నుంచి ఇంటి రక్షణ కోసం రకరకాల ఆచారాలను పాటిస్తూ వస్తున్నాం. అందులో ప్రధానమైనది ఇంటి సింహద్వారం వద్ద పటిక కట్టడం. శాస్త్రీయంగా పటికలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నప్పటికీ.. ఆధ్యాత్మికంగా, వాస్తు పరంగా దీనికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. ఇంటి లోపలికి వచ్చే ప్రతికూల ప్రకంపనలను అడ్డుకుని, సానుకూల శక్తిని పెంచడంలో పటిక అద్భుతంగా పని చేస్తుంది. అసలు పటికను గుమ్మానికి ఎందుకు కట్టాలి ? దాని వెనక ఉన్న విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పటిక అంటే ఏంటి?
పటిక అనేది ఒక రకమైన సహజమైన ఖనిజ లవణం. ఇది సాధారణంగా.. తెల్లటి రంగులో ఉంటుంది. నీటిని శుద్ధి చేయడానికి.. చర్మ వ్యాధుల నివారణకు దీనిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం.. పటికలో పరిసరాలలోని శక్తిని గ్రహించే గుణం ఎక్కువగా ఉంటుంది.
సింహ ద్వారం వద్ద పటిక ఎందుకు ఉండాలి ?
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారం అనేది కేవలం మనుషులు వచ్చే దారి మాత్రమే కాదు. శక్తి ప్రవహించే మార్గం కూడా..
నెగటివ్ ఎనర్జీని పీల్చుకోవడం: బయటి వ్యక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు వారి ఆలోచనలు, దృష్టి లోపాలు మనపై పడే అవకాశం ఉంటుంది. ఇంటి గుమ్మం వద్ద పటిక ముక్కను కట్టడం వల్ల అది బయటి నుంచి వచ్చే ప్రతికూల శక్తులను తనలోకి పీల్చుకుని, ఇంట్లోకి పంపకుండా అడ్డుకుంటుంది.
ప్రశాంతత: ఇంట్లో గొడవలు ఎక్కువగా జరుగుతున్నా లేదా చికాకులు ఉన్నా.. పటిక ఇంట్లోని వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చడానికి దోహద పడుతుంది.
దుష్ట శక్తుల నివారణ: పాత కాలం నుంచి నమ్మకం ప్రకారం.. పటిక దుష్ట శక్తులను ఇంటి దరి చేరకుండా రక్షణ కవచంలా పని చేస్తుంది.
పటికను ఎలా ఉపయోగించాలి ?
ఇంటి గుమ్మం వద్ద పటికను ఉంచడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.
నల్లటి గుడ్డలో కట్టడం: ఒక చిన్న పటిక ముక్కను తీసుకుని నల్లటి లేదా ఎర్రటి కాటన్ గుడ్డలో మూటకట్టి, సింహ ద్వారం పైన మధ్యలో వేలాడదీయాలి. దీని వల్ల నర దృష్టి ప్రభావం ఉండదు.
నీటిలో కలిపి చల్లడం: ప్రతి రోజూ ఉదయం ఇంటి గుమ్మం కడిగిన తర్వాత.. కొద్దిగా పటిక పొడి కలిపిన నీటిని చల్లడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్ముతారు.
గాజు గిన్నెలో ఉంచడం: ఆఫీసుల్లో లేదా వ్యాపార సంస్థలలో అయితే.. సింహ ద్వారం పక్కన ఒక చిన్న గాజు గిన్నెలో.. పటిక ముక్కలను ఉంచడం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది.
ఎప్పుడు మార్చాలి ?
పటిక బయటి నెగటివ్ ఎనర్జీని నిరంతరం పీల్చుకుంటుంది కాబట్టి.. అది క్రమంగా నల్లగా మారడం లేదా కరిగి పోవడం జరుగుతుంది.
నెలకు ఒక సారి లేదా పటిక రంగు మారినప్పుడు దానిని తీసేసి.. ప్రవహించే నీటిలో (కాలువ లేదా నది) పారవేయాలి.
పాత దాని స్థానంలో కొత్త పటిక ముక్కను మళ్లీ కట్టాలి.
Also Read: జుట్టు పలచబడుతోందా ? ఐరన్ లోపం కావచ్చు
శాస్త్రీయ కోణం:
పటికలో ఉండే రసాయన గుణాలు గాలిలోని తేమను గ్రహించి, చుట్టు పక్కల ఉండే సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. తద్వారా ఇంటి లోపలికి స్వచ్ఛమైన గాలి ప్రవేశించడానికి ఇది సహాయ పడుతుంది.
ఇంటి గుమ్మం వద్ద పటికను ఉంచడం అనేది కేవలం మూఢనమ్మకం కాదు. అది మన మానసిక స్థితిని, ఇంటి వాతావరణాన్ని పాజిటివ్‌గా ఉంచే ఒక సులభమైన వాస్తు పరిహారం. తక్కువ ఖర్చుతో కూడిన.. ఈ చిన్న చిట్కాను పాటించి మీ ఇంట్లో సుఖ శాంతులను పెంపొందించుకోవచ్చు.