E-Paper
Advertisement

TG Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రమాద బీమాపై కీలక ప్రకటన

TG Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రమాద బీమాపై కీలక ప్రకటన
Advertisement

TG Govt Employees: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చే ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని భట్టి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందన్నారు.

బ్యాంకులతో చర్చలు

రూ.1.02 కోట్ల ప్రమాద బీమాకు సంబంధించిన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిశాయని డిప్యూటీ సీఎం వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం ప్రతి నెల క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల ప్రమాద బీమాకు సంబంధించి ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో పరిధిలోని ఉద్యోగులందరికీ కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.

Advertisement

Also Read: కేంద్ర బడ్జెట్ 2026.. 80C పరిమితి పెంచుతారా?.. ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు

సింగరేణి, విద్యుత్ ఉద్యోగులకు అమలు

ప్రభుత్వం చొరవతో చేపట్టిన కోటి రూపాయలకు పైగా ప్రమాద బీమా కార్యక్రమం అమలు అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే సింగరేణిలో 38,000 మంది రెగ్యులర్ ఉద్యోగులకు, విద్యుత్ సంస్థల్లో 71,387 మంది ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం 1.02 కోట్ల ప్రమాద బీమాను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Related News

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

Big Stories

Advertisement
×