E-Paper
Advertisement

Deputy CM Bhatti Vikramarka: ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తాం.. ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకే రిటైర్మెంట్ పెంపు!

Deputy CM Bhatti Vikramarka: ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తాం.. ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకే రిటైర్మెంట్ పెంపు!
Advertisement

Deputy CM Bhatti Vikramarka: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను సరిచేస్తూ సాధ్యమైనంత త్వరగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలిలో సభ్యుడు ఏవీఎన్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సవివరంగా సమాధానమిచ్చారు.

గత ప్రభుత్వం ఉద్యోగులకు 18వ తేదీ వరకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండేదని, దీనివల్ల ఈఎంఐలు (EMI) కట్టలేక ఉద్యోగులు డిఫాల్టర్లుగా మారేవారని భట్టి గుర్తుచేశారు. ఆ పరిస్థితిని మార్చి, తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Advertisement

గత ప్రభుత్వం ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకే ఉద్యోగుల పదవీ విరమణ వయసును మూడేళ్లు పెంచిందని డిప్యూటీ సీఎం విమర్శించారు. వయసు పెంచకపోతే 2021-23 మధ్య 26,854 మంది రిటైర్ అయ్యేవారని, కానీ పెంపు వల్ల కేవలం 6,354 మంది మాత్రమే రిటైర్ అయ్యారని గణాంకాలతో సహా వివరించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకే ఈ నిర్ణయం తీసుకున్నారని, వాస్తవం తెలియక నాడు ఉద్యోగులు పాలాభిషేకాలు చేశారని ఎద్దేవా చేశారు.

2023 డిసెంబర్ నాటికి గత ప్రభుత్వం రూ. 43,154 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని, అందులో ఉద్యోగుల బకాయిలే రూ. 4,575 కోట్లు ఉన్నాయని శ్వేతపత్రంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం వచ్చాక రూ. 1,752 కోట్ల పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించామన్నారు. ఉద్యోగుల బకాయిల క్లియరెన్స్ కోసం ప్రతి నెలా రూ. 700 కోట్లకు తగ్గకుండా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

మెడికల్ బిల్లులను పెండింగ్‌లో పెట్టడం అమానవీయమని భావించి, ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న రూ. 200 కోట్ల బిల్లులను పూర్తిగా క్లియర్ చేశామన్నారు. అలాగే రూ. 560 కోట్ల సప్లిమెంటరీ జీతాల బకాయిలను కూడా చెల్లించామని, ఇకపై ఏ నెలకు ఆ నెల బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల కోసం కొత్త హెల్త్ స్కీమ్‌ను వారే డిజైన్ చేసుకోవచ్చని, సమస్యల పరిష్కారానికి ‘జాయింట్ స్టాఫ్ కౌన్సిల్’ను కూడా ఏర్పాటు చేశామని భట్టి వివరించారు.

Related News

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

Big Stories

Advertisement
×