TGSRTC: స్వేచ్చ బ్యూరో: రోడ్డు రవాణా సంస్థ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులకు శ్రీకారం చుడుతుంది. వ్యాపార రంగంలోనూ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. కేవలం ప్రయాణికులను చేరవేయడమే కాకుండా, సంస్థ పరిధిలోని వనరులను సద్వినియోగం చేసుకొని ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ వ్యాపార సముదాయాలను అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు సంస్థ సిద్ధమవుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి, తమ సంస్థలను విస్తరించుకోవాలనుకునే వారికి ఇది బంపర్ ఆఫర్‌గా నిలవనుంది.
ఏ వ్యాపారానికైనా కస్టమర్లే కీలకం. అయితే నిత్యం ఆర్టీసీ బస్టాండ్లు, కాంప్లెక్స్‌లు నిరంతరం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతాల్లో వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడం, ప్రచార ఖర్చులు లేకుండానే వ్యాపారస్తులకు కస్టమర్లు వస్తారు. హోటళ్లు, ఫుడ్ కోర్టులు, సూపర్ మార్కెట్లు, బ్రాండెడ్ షోరూమ్‌ల నుంచి చిన్న తరహా దుకాణాల వరకు అన్ని రకాల వ్యాపారాలకు ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ లు అనువైన వేదికలుగా మారనున్నాయి.
ఆర్టీసీకి ఉమ్మడి జిల్లాల్లోని బస్టాండులలో కాంప్లెక్సులు ఉన్నాయి. వాటిలో దుకాణాలకు అనుగుణంగా షెటర్లు ఉన్నాయి. అయితేసంస్థను లాభాల బాట పట్టించడంతో పాటు, స్థానిక నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉన్నతాశయంతో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. పారదర్శకమైన నిబంధనలు, లీజు పద్ధతుల ద్వారా ఈ స్థలాలను కేటాయించబోతున్నారు.
Also read: పసి పిల్లాడిని బలి తీసుకునే అల్మారా… ఒళ్లు గగుర్పొడిచే సీన్లున్న హర్రర్ మూవీ
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, డిపోల పరిధిలో ఉన్న ఈ ఖాళీ వ్యాపార సముదాయాల వివరాలను సంస్థ అధికారిక వెబ్‌సైట్ tgsrtc.telangana.gov.in లో పొందుపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 694 షాపులకు త్వరలో టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ లో 54 స్టాల్స్, ఆదిలాబాద్ లో 40, కరీంనగర్ లో68, ఖమ్మంలో 97, వరంగల్ లో62, మెదక్ లో 53, నల్లగొండలో 74, రంగారెడ్డిలో 35, మహబూబ్ నగర్ లో 150, హైదరాబాద్ లో 42, సికింద్రాబాద్ లో 19 స్టాల్స్ ఉన్నాయి. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం అటు రవాణా సంస్థకు అదనపు ఆదాయాన్ని సమకూరుస్తూ, ఇటు వ్యాపార రంగానికి సరికొత్త ఊతాన్ని ఇస్తుందని పలు అభిప్రాయపడుతున్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ సువర్ణావకాశాన్ని అందుపుచ్చుకుని వ్యాపారంలో రాణించాలని కోరుతున్నారు.
ఆర్టీసీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ, పారదర్శకతకు పెద్దపీట వేసేలా సంస్థ పరిధిలోని అన్ని వ్యాపార సముదాయాల వివరాలను సంస్థ యాజమాన్యం అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఏయే ప్రాంతాల్లో ఎన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి… అవి ఖాళీగా ఉన్నాయా లేక నిండిపోయాయా, ప్రస్తుతం ఆ షాప్ లను ఎవరు నిర్వహిస్తున్నారు, వారి లీజు కాలపరిమితి, అద్దె ఎంత అనే పూర్తి సమాచారాన్ని క్లియర్ గా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. దళారీ వ్యవస్థకు పూర్తిగా చెక్ పెడుతూ, వ్యాపార ప్రకటనలు, అద్దెదారుల ఎంపికలో డిజిటల్ జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఆర్టీసీ స్థలాల్లో షాప్స్ నిర్వహణ ప్రక్రియను మరింత సరళతరం చేశాం. వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. “టీజీఎస్ ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సదావకాశం వ్యాపారులకు ఎంతో లాభదాయకమని, దీనిని సద్వినియోగం చేసుకుని వ్యాపార వృద్ధిని సాధించడమే కాకుండా సంస్థ ప్రగతిలో భాగస్వాములు కావాలి.
Also read: Crop Burning: హైదరాబాద్‌కు డేంజర్ బెల్స్.. సాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ నిజాలు..?