E-Paper
Advertisement

రెనాల్ట్ కైగర్‌కు 4 కొత్త వేరియంట్లు.. తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్స్!

రెనాల్ట్ కైగర్‌కు 4 కొత్త వేరియంట్లు.. తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్స్!
Advertisement

భారత మార్కెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోడల్ రెనాల్ట్ కైగర్. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి  మరిన్ని ఆప్షన్స్ ను అందించేందుకు రెనాల్ట్ కొత్త వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ తాజాగా  నాలుగు న్యూ వేరియంట్లను పరిచయం చేసింది. కైగర్‌ ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇప్పుడు మరిన్ని ఫీచర్లు, ఎక్కువ పవర్‌ ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి.

కొత్తగా ఎవల్యూషన్+ వేరియంట్‌

Advertisement

రెనాల్ట్ కొత్తగా ‘ఎవల్యూషన్+’ వేరియంట్‌ ను తీసుకొచ్చింది. ఈ వేరియంట్ ప్రస్తుతం ఉన్న ఎవల్యూషన్, టెక్నో వేరియంట్ల మధ్యలో ఉంటుంది. ఇంతకుముందు ఖరీదైన వేరియంట్లలో మాత్రమే లభించే కొన్ని ఫీచర్లను ఇప్పుడు ఈ కొత్త ట్రిమ్‌ లో కూడా అందిస్తోంది. కొత్త ఎవల్యూషన్+ వేరియంట్‌ లో స్మార్ట్ యాక్సెస్ కార్డ్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌ లెస్ స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, కొత్త ఫ్యాబ్రిక్ సీట్లు లాంటి ఫీచర్లు ఉన్నాయి.

ధర ఎంత అంటే?   

ఈ వేరియంట్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ లో కూడా అందుబాటులో ఉంటుంది. కొత్త ఎవల్యూషన్+ వేరియంట్ ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. అదే సమయంలో కంపెనీ తన టర్బో శ్రేణిని కూడా విస్తరించింది. ఇప్పటి వరకు పరిమిత వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉన్న టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ను ఇప్పుడు మరిన్ని ట్రిమ్‌ లలో అందిస్తోంది. కొత్త ఎవల్యూషన్+ టర్బో ఎంట్రీతో పాటు టెక్నో టర్బో మాన్యువల్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టింది. రెనాల్ట్ కైగర్ టర్బో శ్రేణి ఇప్పుడు రూ.7.89 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. టర్బో వేరియంట్లలో వినియోగదారులు మాన్యువల్ గేర్‌ బాక్స్, సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

కైగర్‌లోని 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 100 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంటుంది. కొత్త వేరియంట్లతో పాటు కైగర్ మెయిన్ ప్రత్యేకతలను కొనసాగిస్తోంది. ఇందులో 205 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, 405 లీటర్ల బూట్ స్పేస్, 29 లీటర్ల ఇంటీరియర్ స్టోరేజ్ సామర్థ్యం ఉన్నాయి. అదనంగా 50 కిలోల వరకు బరువును మోయగల రూఫ్ రైల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వెనుక సీట్లలో ప్రయాణించే వారికి మంచి లెగ్‌ రూమ్ కూడా ఈ ఎస్‌యూవీ ప్రత్యేకతగా చెప్పవచ్చు. కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఎక్కువ స్థలం, ప్రాక్టికల్ ఫీచర్ల ను కైగర్ అందిస్తోంది. ప్రస్తుతం దేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని వేరియంట్లు, అదనపు ఫీచర్లు, తక్కువ ధరలతో రెనాల్ట్ కైగర్ మరింత మంది వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

Read Also: మళ్లీ మార్కెట్ లోకి స్ప్లెండర్ ప్రో క్లాసిక్.. హీరో ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా థార్ OG వచ్చేసింది.. కొత్త మోడల్ లో ఏం మారిందంటే?

హైదరాబాద్‌లో వింత కార్ల మ్యూజియం.. ప్రపంచంలో ఎక్కడా చూడని కార్లు ఇక్కడే!

హోండా నుంచి 3 కొత్త అప్ డేటెడ్ మోడళ్లు.. ధరలు, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×