E-Paper
Advertisement

పసి పిల్లాడిని బలి తీసుకునే అల్మారా… ఒళ్లు గగుర్పొడిచే సీన్లున్న హర్రర్ మూవీ

పసి పిల్లాడిని బలి తీసుకునే అల్మారా… ఒళ్లు గగుర్పొడిచే సీన్లున్న హర్రర్ మూవీ
Advertisement

Horror Movie : టర్కిష్ హారర్ సినిమాల్లో అత్యంత భయంకరమైన బ్లాక్ మ్యాజిక్ థ్రిల్లర్ ‘సిక్సిన్ 2’ (Siccin 2). 2015లో విడుదలై ఈ సూపర్ నేచురల్ హారర్ ఫ్యాన్స్‌ ను దీర్ఘకాలం వెంటాడింది అని చెప్పాలి. ఈ సినిమాలో ఇస్లామిక్ బ్లాక్ మ్యాజిక్ ను అత్యంత భయంకరంగా చూపించారు. ఒక తల్లి ఎదుర్కొనే మానసిక వేదన, వంశపారంపర్య శాపం, పశ్చాత్తాపం నిండిన ఈ కథ మిమ్మల్ని చివరి ఫ్రేమ్ వరకు టెన్షన్‌లో ఉంచేస్తుంది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

హిక్రాన్ (Hicran), అద్నాన్ (Adnan) అనే దంపతుల చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. తమ రెండేళ్ల కుమారుడు బిరోల్‌తో చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. కానీ ఒక రోజు వంటగదిలో ఉన్న హిక్రాన్‌ కు భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. ఆమె పరుగెత్తుకుంటూ వచ్చేసరికి… భారీ చెక్క అల్మారా దానంతట అదే కూలి, చిన్నారి బిరోల్‌ ను పూర్తిగా నలిపేసి ఉంటుంది. ఆ పసివాడు అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తాడు. ఈ ఘోర ప్రమాదం తర్వాత అద్నాన్ పూర్తిగా మారిపోతాడు.

Advertisement

తన కొడుకు మరణానికి హిక్రాన్ నిర్లక్ష్యమే కారణమని ఆమెను ద్వేషించి, ఆమె నుంచి దూరమవుతాడు. ఒంటరిగా, దుఃఖంతో మునిగిపోయిన హిక్రాన్‌ కు ఇంట్లో వింత వింత సంఘటనలు ఎదురవుతాయి. రాత్రి వేళల్లో వినిపించే భయంకర శబ్దాలు, వాటంతట అవే కదిలే వస్తువులు, నల్లటి బట్టలు వేసుకున్న ఇద్దరు మహిళల రూపాలు… ఇవన్నీ ఆమెను మానసికంగా కుంగదీస్తాయి. భయం, ఆందోళనతో హిక్రాన్ ఆధ్యాత్మిక గురువు (అబ్దుల్లా హోడ్జా) దగ్గరకు వెళ్తుంది. ఆమెను చూసిన గురువు షాక్ అవుతాడు. ఆమెపై అత్యంత ప్రమాదకరమైన “41 దిల్లీల” (41 స్టిచెస్) చేతబడి జరిగిందని, ఇది ఒక వంశపారంపర్య శాపమని వెల్లడిస్తాడు.

ఈ శాపం కేవలం హిక్రాన్‌ను మాత్రమే కాదు, ఆమె తర్వాతి తరాలను కూడా బలి తీసుకుంటుందని హెచ్చరిస్తాడు. దీంతో హిక్రాన్ తన గతాన్ని తెలుసుకుంటుంది. అప్పుడు బయటపడే సత్యం ఆమెను పూర్తిగా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆ చేతబడిని చేయించింది మరెవరో కాదు… ఆమె సొంత అమ్మమ్మ. మరి స్వంత అమ్మమ్మ ఇలాంటి దారుణానికి ఒడిగట్టడానికి గల కారణం ఏంటి ? హీరోయిన్ గతం ఏంటి ? తరతరాలుగా వెంటాడే ఆ చేతబడిని, శాపాన్ని ఆమె ఎలా నాశనం చేసింది ? చివరికి ఆమె ఈ ప్రమాదం నుంచి ఎలా గట్టెక్కింది ? అన్నది స్టోరీ. సినిమా భయంకరమైన ఎండింగ్‌తో ముగుస్తుంది. ‘సిక్సిన్ 2’ ఇప్పటికీ టర్కిష్ హారర్ సినిమాల్లో ఒక మైలురాయి. ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

Tags

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×