E-Paper
Advertisement

బీఆరెస్‌కు మ‌రింత మంది జీవ‌న్‌రెడ్డిలు కావలెను!

బీఆరెస్‌కు మ‌రింత మంది జీవ‌న్‌రెడ్డిలు కావలెను!
Advertisement

కేసీఆర్ అంతే. అనుకూల, ప్ర‌తికూల స‌మ‌యాల్లో ఎప్పుడు ఎట్లా మ‌సలుకోవాలో తెలిసిన లీడ‌ర్‌. అందుకే ఇప్పుడు ఆయ‌న మౌన ముని పాత్ర పోషిస్తున్నాడు. సైలెంట్‌గా ఉంటూ రాజ‌కీయాల‌కు కీన్‌గా గ‌మ‌నిస్తున్నాడు. జీవ‌న్‌రెడ్డి రాక‌ను ఆ పార్టీ త‌మ బ‌లంగానే భావిస్తున్న‌ది. సీనియ‌ర్ లీడ‌ర్, పెద్ద‌గా అవినీతి మ‌ర‌క‌లు లేవు.. స‌బ్జెక్టున్న నేత‌.. ఈ క్వాలిఫికేష‌న్ల‌ను ప్ర‌ధానంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ది. రేవంత్ రెడ్డిని, స‌ర్కార్‌ను అదే పార్టీ నుంచి వ‌చ్చిన సీనియ‌ర్ నేత చేత తిట్టిస్తే.. ఆ మాట‌లు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా పోతాయ‌ని కేసీఆర్‌కు తెలుసు. అంత‌కు ముందు జ‌రిగిన లొల్లంతా ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు ప‌ట్ట‌వు. కేసీఆర్ ప‌ట్టించుకోడు. అందుకే ఎవ‌రేమ‌న్నా.. జీవ‌న్‌రెడ్డిని బీఆరెస్‌లోకి ర‌ప్పించే క్ర‌మంలో కేసీఆర్ కూడా చాలా ఇంట్ర‌స్టు చూపాడ‌నే అనాలి. మున్ముందు పార్టీలో కూడా స‌ముచిత ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. ఇలాంటి నేత‌లు ఇంకా కావాలి బీఆరెస్‌కు.

అవును. బీఆరెస్‌ను బలోపేతం చేయాలంటే .. వ‌చ్చే జ‌న‌ర‌ల్ ఎన్నిక‌లే టార్గెట్‌గా ప‌నిచేసుకుంటూ పోవాలి. దీని కోసం ఇప్ప‌ట్నుంచే బీఆరెస్ ఆ దిశ‌గా గ‌ట్టిగానే అడుగులు వేస్తూ వ‌స్తోంది. కేసీఆర్ స‌రైన స‌మయంలో తాను ప్ర‌జాక్షేత్రంలోకి రావాల‌ని అనుకుంటున్నారు. క‌లుగులోంచి ఎలుక‌ను లాగిన‌ట్టు బ‌య‌ట‌కు ఎంత లాగాల‌నుకున్నా కేసీఆర రాడు. వారి మాట‌లు ప‌ట్టించుకోడు. ఇప్ప‌టి దాకా జ‌రిగిన ప‌రిస్థితులు చూస్తే అట్ల‌నే ఉంది. ఇక మంత్రి ప‌ద‌వులు రాలేద‌ని ఏకంగా శాస‌న మండ‌లి, అసెంబ్లీ వేదిక‌ల‌పైనే స‌ర్కార్‌ను కార్న‌ర్ చేసే మాట్లాడే నేత‌ల‌పైనా కేసీఆర్ న‌జ‌ర్ పెట్టాడు. వాళ్ల అసంతృప్తి ఇంకా పెచ్చు మీరాల‌నేది ఆ పార్టీ కోరిక‌. స‌మ‌యం చూసి గాలం వేసే ప‌నిలో ఉంది ఇప్పుడు బీఆరెస్‌.

Advertisement

అందుకే జీవ‌న్‌రెడ్డిలా పార్టీలో స‌రైన ప్ర‌యార్టీ క‌రువైన నేత‌లంద‌రిపైనా దృష్టి పెట్టింది బీఆరెస్‌. వారికి స‌ముచిత ప్రాధాన్య‌త‌నిస్తామంటారు. ప‌ద‌వులు క‌ట్ట‌బెడ‌తామంటారు. మ‌ర్యాద‌ల‌కు త‌క్కువ కాకుండా చూస్తారు. ఈ ప‌నిని ఎన్నిక‌ల‌కు ఒక ఏడాది ముందు నుంచి స్పీడ్ చేద్దామనుకున్న గులాబీ పార్టీకి… వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలిన‌ట్టు.. జీవ‌న్ రెడ్డి రూపంలో తొంద‌ర‌గానే వ‌చ్చి వారికి.

ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ లైట్‌గా తీసుకుంటే న‌ష్టం జ‌ర‌గ‌క త‌ప్ప‌దు. కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కాలంగా ప‌నిచేసి .. ఎలాంటి ప‌ద‌వులు లేక ఉన్న‌వారు చాలా మందే ఉన్నారు. వీరిలో అసంతృప్తి పెర‌గ‌క ముందే అధిష్టానం మేల్కోవాలి. చెప్పి చూశాం.. విన‌లేదు. అని స‌మ‌ర్థించుకునే దోర‌ణి కాకుండా కీల‌క‌మైన‌, సీనియ‌ర్ నేత‌లెవరూ పార్టీ వీడే ప‌రిస్థితిని రానీయ‌కుండా చూడాల్సి ఉంటుంది. అసంతృప్తి పెర‌గ‌కుండా క‌ట్ట‌డి చేయాల్సిన బాధ్య‌త మ‌రింత పెరిగింద‌నే గుర్తించాలి.

Related News

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

Big Stories

Advertisement
×