E-Paper
Advertisement

ఏపీ క్యాబినెట్‌లో మార్పులు ఖాయమా? సీఎం ‘క్లాస్’ వెనుక అసలు వ్యూహం ఇదే!

ఏపీ క్యాబినెట్‌లో మార్పులు ఖాయమా? సీఎం ‘క్లాస్’ వెనుక అసలు వ్యూహం ఇదే!
Advertisement

Ministers Performance: ఇక అంతా జవాబుదారి విధానమే.. ప్రతీ అంశంపైన లోతుగా అధ్యాయం చేయాలి.. నిర్ణయాలు తీసుకొనే ముందే జాగ్రత్తలు పాటించాలి.. అన్నింటిని ఎప్పటికి అప్పుడు పరిశీలిస్తాం.. పరిష్కారం కానీ అంశాలు ఉంటే, సమస్య తీవ్రంగా ఉంటే సీఎం, డిప్యూటీ సీఎం దృష్టిలోకి తీసుకొని రావాలి.. ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం తన మంత్రులకు చేసిన సూచనలు.. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఇప్పట్లో ఉండవనే సంకేతాలు ఇస్తూనే మంత్రులు తమ బాధ్యతలు సరిగ్గా నిర్వహించాల్సిందే అని సీఎం చంద్రబాబు సూటిగా చెప్పేశారుట.. ఆ క్రమంలో ఏపీలో మంత్రివర్గ విస్తరణ అంశం, అమాత్యులకు సీఎం పీకిన క్లాస్ హాట్‌టాపిక్‌గా మారింది

సీఎం చంద్రబాబు ఫోకస్

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి తర్వలో రెండేళ్లు పూర్తికానుంది… వైసీపీ హయాంలో గాడి తప్పిన వ్యవస్థలను ఓ పద్ధతిలోకి తీసుకొని రావడానికే ఈ పుణ్యంకాలం అంతా గడిచిపోయిందని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ఇక ఇప్పుడు పాలన పూర్తి స్థాయిలో సాగేలా సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే పెట్టుబడులు రావాలి, అనే ఆలోచనతో వాటిపై సీఎం దృష్టి పెట్టారు.

అభివృద్ధి, సంక్షేమంపై కొత్త వ్యూహం

Advertisement

ఇక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోంది.. ఓ వైపు వీటిని ముందుకు సాగిస్తూనే సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ఉండేలా ఇప్పుడు చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేశారని తెలుస్తోంది.. ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీలో కూడా ఇదే అంశం పైన సుధీర్ఘ చర్చ కూడా జరిగిందని టాక్.. ఇక వారి భేటీలో మంత్రి వర్గంలో మార్పుల గురించి ప్రస్తావనకు వచ్చిందని, కొన్ని కారణాల వల్ల ఆ ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు టీడీపీ సీనియర్ నేతలు అంటున్నారు..

మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఫోకస్

రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్నా, అనుకున్న లక్ష్యం వైపు పరుగులు తీయాలన్నా తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ మాత్రమే పరుగులు తీస్తే సరిపోదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారంట… ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఓ ఎనిమిది మంది మినహాయించి మిగిలిన వాళ్ళు అనుకున్న స్థాయిలో పరుగులు తీయటం లేదని చంద్రబాబు గుర్తించినట్లు పార్టీ నేతలు అంటున్నారు… ఆ క్రమంలో సంతృప్తికర రీతిలో పనిచేయని మంత్రులపై సీఎం ప్రత్యేక దృష్టి సారిస్తూ, వారితో మాట్లాడుతున్నారంట.

శాఖల పనితీరుపై సీఎం సూటి దృష్టి

Advertisement

మంత్రుల పరిధిలో వున్న ఆయా శాఖల పనితీరు, వాటిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సీఎం నేరుగా రంగంలోకి దిగి ఆయా శాఖలకు సంబందించిన నివేదికలు తెప్పించుకుని, వాటిని పరిశీలించి సంబంధిత మంత్రులతో మాట్లాడుతున్నారని అధికారులు కూడా అంటున్నారు… ఏపీకి ఆదాయం సమాకూర్చే రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు అబ్కారీ శాఖపైన ఇప్పటికే సీఎం లోతుగా సమీక్షలు జరిపి ఆయా శాఖల మంత్రులకు పలు సూచనలు కూడా చేసినట్టు సమాచారం.

మంత్రులకు చంద్రబాబు క్లాస్

మంత్రులలో కొందరు ఇంకా ఆయా శాఖల్లో పట్టు సాధించక పోవటం, అనుకున్న లక్ష్యాలు అందుకో లేక పోతుండటం వంటివి సీఎం చంద్రబాబు సీరియస్‌గా తీసుకుంటున్నారుట.. కొందరు మంత్రులు తమ శాఖలకు సంబందించి కనీసం నెలవారీ సమావేశాలు కూడా పెట్టటం లేదని గుర్తించి, ఆయా మంత్రులకు గట్టిగానే క్లాస్ ఇచ్చారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.. మంత్రులు సమర్ధంగా పని చేస్తేనే అభివృద్ధిలో వేగం పెరుగుతుందనే విషయాన్ని పదే పదే సీఎం వారికి గుర్తుచేస్తున్నారంట.

డెడ్‌లైన్‌తో పని చేయాలి

ప్రతీ పనికి నిర్థిష్ట కాల పరిమితి పెట్టుకొని ముందుకు వెళ్ళాలని, ఈ విషయంలో ఏదైనా సమస్య వస్తే మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అవసరం అయితే తన దృష్టికి తీసుకొని రావాలి కానీ, ఆయా అంశాల గాలికి వదిలి వేయవద్దని మంత్రులకు సూటిగా చెప్పేశారుట… ఇక ప్రతీ నెల మంత్రుల శాఖల పని తీరు పై సీఎం నేరుగా నివేదికలు కూడా తెప్పించుకునే ఏర్పాట్లు కూడా జరిగినట్టు అధికారులు చెప్పుతున్నారు…

మంత్రులకు సీఎం కఠిన సందేశం

మంత్రుల్లో జవాబుదారీతనం పెరిగితే పనులు, అభివృద్ధి వేగం పుంజుకుంటాయని సీఎం తన అమాత్యులకు చెప్పారట… సమస్యల పరిష్కారంలో మంత్రుల మధ్య సమన్వయం ఉండాలని, దాని వల్ల పరిష్కారం సులభం అవుతుందని సూచించిన సీఎం .. సమస్యలు తీరితేనే ప్రభుత్వం పైన ప్రజలకు విశ్వాసం పెరుగుతుందన్న విషయం మంత్రులకు స్పష్టం చేస్తున్నారంట… ఇక ఇప్పుడు వున్న మంత్రుల్లో కొందరి పనితీరు అసంతృప్తిగా వున్న నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పుల గురించి కూడా ముఖ్యమంత్రి ఆలోచన చేశారంట.

మూడు నెలల్లో సత్తా చూపాలి

అయితే ప్రభుత్వం ఏర్పటి ఇంకా పూర్తిగా రెండేళ్లు కూడా పూర్తికాకపోవడంతో.. మరి కొంత కాలం ఆయా మంత్రులకు అవకాశం ఇచ్చి, పని తీరు మెరుగు పర్చుకోవాలని మార్గనిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మరో మూడు, నాలుగు నెలల వరకు మంత్రి వర్గం లో ఎలాంటి మార్పులు ఉండవని, ఇప్పుడు సీఎం చంద్రబాబు టార్గెట్ ఏపీ అభివృద్ధి మాత్రమేనని పార్టీ సీనియర్ నేత ఒకరు స్పష్టత ఇచ్చారు…ఇక ఇప్పుడు మంత్రులు తమ సత్తా నిరూపించుకునే సమయం వచ్చిందని ఆయన అన్నారు… మరి అప్పటికీ పనితీరు మెరుగుపర్చుకోని మంత్రుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ ఎక్కడకి వస్తుందో వాట్సాప్‌లో చూసుకోండి.. జజీరా కొత్త ప్లాన్!

Story by: Apparao, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×