E-Paper
Advertisement

ఇంకా పెళ్లి కాలేదా? అయితే ఈ రీసెర్చ్ రిపోర్ట్ మీ కోసమే.. క్యాన్సర్ రిస్క్‌పై సంచలన నిజాలు

ఇంకా పెళ్లి కాలేదా? అయితే ఈ రీసెర్చ్ రిపోర్ట్ మీ కోసమే.. క్యాన్సర్ రిస్క్‌పై సంచలన నిజాలు
Advertisement

Cancer Risk Research: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే.. క్యాన్సర్ రావడానికి కేవలం ఆహారం, వాతావరణం మాత్రమే కాదు.. మన వైవాహిక స్థితి కూడా ఒక కారణం కావొచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. వివాహం చేసుకోని వ్యక్తుల్లో క్యాన్సర్ వచ్చే ముప్పు, వివాహితుల కంటే చాలా ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 10 కోట్ల మందిపై జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైన విషయాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు పెళ్లికి, క్యాన్సర్‌కు సంబంధం ఏంటి? ఒంటరిగా ఉండటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలేంటి? పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

పరిశోధనలో తేలిన షాకింగ్ నిజాలు:

క్యాన్సర్ అనేది శరీరంలోని కణాలు అదుపులేకుండా పెరగడం వల్ల వచ్చే వ్యాధి. అయితే.. ‘క్యాన్సర్ రీసెర్చ్ కమ్యూనికేషన్స్’ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఒంటరిగా ఉండేవారిలో ఈ ప్రమాదం పొంచి ఉంది.

Advertisement

1. మహిళల్లో 85% ఎక్కువ ముప్పు:
అస్సలు వివాహం చేసుకోని మహిళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం 85 శాతం ఎక్కువగా ఉందని ఈ స్టడీ వెల్లడించింది. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ వంటివి వివాహం కాని వారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు.

2. పురుషులకు తప్పని ముప్పు:
జీవితాంతం ఒంటరిగా మిగిలిపోయే పురుషులలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం 70 శాతం అధికంగా ఉంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, అన్నవాహిక, కోలన్ క్యాన్సర్ వంటివి వీరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

Advertisement

వివాహానికి, ఆరోగ్యానికి సంబంధం ఏంటి?

పెళ్లి అనేది కేవలం ఒక సామాజిక బంధం మాత్రమే కాదు. అది ఒక వ్యక్తికి భావోద్వేగ, ఆర్థిక , ఆచరణాత్మక మద్దతును ఇస్తుంది. ఈ మద్దతే క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

1.సరైన లైఫ్ స్టైల్: పెళ్లైన వ్యక్తులు తమ భాగస్వామి కోసం, పిల్లల కోసం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. దీని వల్ల వారు స్మోకింగ్, డ్రింకింగ్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది.

2.త్వరగా గుర్తించడం: మన శరీరంలో ఏవైనా మార్పులు వస్తే.. మనం గమనించకపోయినా, మన భాగస్వామి గమనించి డాక్టరు దగ్గరకు తీసుకెళ్లే అవకాశం ఉంది. క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే నయం చేసే అవకాశాలు 90% పెరుగుతాయి.

3.భావోద్వేగ బలం: ఒంటరితనం వల్ల కలిగే ఒత్తిడి వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది. వివాహితుల్లో ఉండే సామాజిక మద్దతు వారి మానసిక స్థితిని మెరుగుపరిచి, వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.

ముప్పు ఎక్కువగా ఉన్న క్యాన్సర్ రకాలు:
ఈ అధ్యయనం ప్రకారం.. వివాహం కాని వారిలో కొన్ని రకాల క్యాన్సర్లు విపరీతంగా కనిపిస్తున్నాయి.

Also Read: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హోం సేఫ్టీ ట్రిక్.. ఇది నిజంగా దొంగలను ఆపుతుందా?

1.అన్నవాహిక క్యాన్సర్: పెళ్లి కాని మగవారిలో ఇది రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంది.

2.గర్భాశయ క్యాన్సర్: పెళ్లి కాని మహిళల్లో ఇది మూడు రెట్లు ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం హెచ్‌పివి (HPV) ఇన్‌ఫెక్షన్ పట్ల అవగాహన లేకపోవడం, సకాలంలో స్క్రీనింగ్ చేయించుకోకపోవడం.

నిపుణుల అభిప్రాయం:
యూనివర్శిటీ ఆఫ్ మయామి ప్రొఫెసర్ ఫ్రాంక్ పెనెడో మాట్లాడుతూ.. “వివాహం అనేది ఏదో ఒక మంత్రదండం కాదు. కానీ.. ఒక తోడు ఉండటం వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది. ఒంటరిగా ఉండేవారిలో సామాజిక మద్దతు లేకపోవడం వల్ల వ్యాధి ముదిరే వరకు వారు గుర్తించలేకపోతున్నారు” అని వివరించారు.

ఈ అధ్యయనం పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం లేదు. కానీ ‘సామాజిక మద్దతు’ ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది. మీరు ఒంటరిగా ఉంటున్నట్లయితే.. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండటం చాలా అవసరం. గుర్తుంచుకోండి.. ఆనందంగా ఉండటం, ఒక తోడును కలిగి ఉండటం మీ శరీరానికి ఇచ్చే ఒక రకమైన మెడిసిన్.

Related News

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

Big Stories

Advertisement
×