E-Paper
Advertisement

Bandi Sanjay: తొందర ఎందుకు బండన్న… ఆర్ఆర్ఆర్ టైంలో పడింది సరిపోదా..?

Bandi Sanjay: తొందర ఎందుకు బండన్న… ఆర్ఆర్ఆర్ టైంలో పడింది సరిపోదా..?

నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఆయా విషయాలకు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా కొందరు విడిపోయి ట్రోలింగ్ చేస్తుంటారు. బాధ్యతగల అధికారులు, ప్రజా ప్రతినిధులు మాత్రం ఆయా వ్యవహారాలకు కాస్త దూరంగానే ఉంటారు. కానీ బండి సంజయ్ లాంటి నేతలు మాత్రం సబ్జెక్ట్ ఏదయినా సంచలనం కోసం కాస్త అడ్వాన్స్ అవుతుంటారు. తాజాగా దర్శకుడు రాజమౌళిపై ఇలాంటి సంచలన వ్యాఖ్యలే చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. “రాజమౌళి నిండు నూరేళ్ళు బతికి మంచిగా సక్సెస్ కావాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. దేవుడిని నమ్మే విధంగా ఆయన్ను మార్చి.. ఆయనపై కరుణ కటాక్షాలు ఉంచాలని కోరుకుంటున్నా” అని సెటైర్లు పేల్చారు. అయితే ఈ సెటైర్లు ఇప్పుడు బండికి రివర్స్ కావడం విశేషం.

టార్గెట్ రాజమౌళి..
సోషల్ మీడియాలో అటెన్షన్ కోరుకుంటున్నవారిలో చాలామంది దర్శకుడు రాజమౌళికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారు. వారణాసి సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్, గ్లింప్స్ రిలీజ్ సమయంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యల్ని వారంతా తప్పుబడుతున్నారు. హిందూ మతాన్ని, హిందూ దేవతల్ని ఆయన అవమానించారని అంటున్నారు. తెలంగాణ బీజేపీకి చెందిన కొందరు నేతలు కూడా రాజమౌళిని టార్గెట్ చేయడం విశేషం. ఎమ్మెల్యే రాజాసింగ్, మహిళా నేత మాధవీలత కూడా రాజమౌళిని టార్గెట్ చేశారు. ఈ లిస్ట్ లోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చేరడం విశేషం. కేంద్ర మంత్రిగా బాధ్యతగల పోస్ట్ లో ఉన్న ఆయన రాజమౌళి వ్యాఖ్యల్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఆయనపై సెటైర్లు పేల్చారు.

ఆర్ఆర్ఆర్ సమయంలో..
బండి సంజయ్ ఆవేశపరుడనే విషయం అందరికీ తెలిసిందే. పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా ఆయన అందరిపై సెటైర్లు పేలుస్తుంటారు. రాజమౌళిపై ఆయన విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో కూడా ఇలానే తొందరపడి విమర్శలు చేసి, చివరకు విమర్శలపాలయ్యారు బండి సంజయ్. ఆ సినిమాలో ఎన్టీఆర్ లుక్ పై అప్పట్లో కొందరు సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కుపెట్టారు. కొమురం భీమ్ స్ఫూర్తితో రూపొందించిన ఎన్టీఆర్ క్యారెక్టర్ ని ముస్లింగా చూపించడాన్ని తప్పుబట్టారు. బండి సంజయ్ కూడా ఆ లిస్ట్ లో ఉన్నారు. థియేటర్లు తగలబెట్టేస్తానంటూ ఏకంగా దర్శకుడు రాజమౌళికి ఆయన వార్నింగ్ ఇచ్చారు కూడా. సినిమా రిలీజ్ తర్వాత ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఏకంగా అమిత్ షా, ఎన్టీఆర్ ని డిన్నర్ కి పిలిపించి మాట్లాడారు. ఆ సమయంలో బండి సంజయ్ కూడా అక్కడ ఉండటం, ఎన్టీఆర్ ని కలవడం విశేషం. సినిమా పోస్టర్ పడినప్పుడు రెచ్చిపోయిన బండన్న, సినిమా రిలీజ్ తర్వాత మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతిలో ట్రోలింగ్ కి గురయ్యారు.

బండన్న ఎప్పుడూ అంతేనా?
కేవలం సినిమాల విషయంలోనే కాదు, పొలిటికల్ కామెంట్స్ లో కూడా బండి బాగా వీక్ అని అంటారు. అప్పటికప్పుడు తనకు నచ్చినదేదో చెప్పేయడం, ఆ తర్వాత తీరిగ్గా నాలుక కరచుకోవడం ాయనకు అలవాటే. గతంలో GHMC పరిధిలో ఒకేసారి వరదలు, ఎన్నికలు వచ్చినప్పుడు ఇల్లు పోతే, బండి పోతే బండి, కారు పోతే కారు… ఇప్పిస్తానంటూ వాగ్దానం చేశారు బండి. ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఇన్సురెన్స్ డబ్బులతో వచ్చేలా చేస్తామని చెప్పి నవ్వులపాలయ్యారు. బండి వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో పార్టీకి నష్టం చేకుర్చాయని అంటారు. అలాంటి వ్యాఖ్యల వల్లే ఆయన బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి కూడా కోల్పోయారనే ప్రచారం ఉంది.

టంగ్ స్లిప్ అనేది అలవాటుగా మారిపోయిన బండి సంజయ్.. తాజాగా దర్శకుడు రాజమౌళిని టార్గెట్ చేయడం విశేషం. వారణాసి సినిమా ఈవెంట్ లో రాజమౌళి వ్యాఖ్యలకు పెడర్థాలు తీస్తూ చాలామంది ట్రోల్ చేస్తుండగా, కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ కూడా ఆ లిస్ట్ లో చేరిపోవడం ఆశ్చర్యంగా ఉంది. మిగతా వారిని ఎవరూ పట్టించుకోకపోయినా, బండిని మాత్రం సినిమా అభిమానులు తిరిగి ట్రోల్ చేస్తున్నారు. అంత తొందరెందుకన్నా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. రేపు సినిమా సక్సెస్ అయిన తర్వాత మోదీ మెచ్చుకుంటే, రాజమౌళికి కంగ్రాట్స్ చెప్పేందుకు బండి సంజయ్ ముందు వరుసలో ఉంటారని చెబుతున్నారు.

Also Read: నేను నెంబర్-1, కేటీఆర్ నెంబర్-2.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×