E-Paper
Advertisement

Vajedu SI Suicide: సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని.. వాజేడు ఎస్సై ఆత్మహత్య..అసలేం జరిగింది..

Vajedu SI Suicide: సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని.. వాజేడు ఎస్సై ఆత్మహత్య..అసలేం జరిగింది..
Advertisement

Vajedu SI Suicide: ములుగు జిల్లాలో ఎస్సై సూసైడ్ చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‌లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటన సోమవారం జరిగింది.

ఆదివారం బందోబస్తు తరువాత.. వాజేడు ఎస్సై రాత్రి సమయంలో యువతితో కలిసి హరిత రిసార్ట్‌కు వెళ్లారు. అయితే ఎస్సై ఆత్మహత్య చేసుకున్న సమయంలో యువతి అదే గదిలో ఉంది. వెంటనే ఆ యువతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? వారిద్దరి మధ్య ఏం జరిగింది.. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ఆత్మహత్య చేసుకున్న ఎస్సై స్వగ్రామం జయంశంకర్ భుపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర్ల గ్రామం. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read: సిద్దిపేట్‌కు సీఎం రేవంత్.. కోకాకోలా గ్రీన్ ప్లాంట్ ప్రారంభం

Advertisement

కాగా కొద్దిరోజుల క్రితం వాజేడు పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు మావోస్టులు హతమార్చారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా రాయపోలులో లేడి కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. వ్యక్తిగత కారణాలు కారణంగా ఎస్సై సూసైడ్ చేసుకున్నారా లేక ఇంకేదన్న కారణం ఉందా.. అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

అయితే తాజాగా ఎస్సై హరీష్ ఆత్మహత్యపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంట్లో చెప్పిన తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో.. తనకు ఇష్టం లేకుండా పెళ్లి సంబంధాలు చూడడంతో మనస్తాపానికి గురై.. ఈ తరుణంలోనే యువతితో రిసార్ట్ కి వెళ్లారు. మ్యారేజ్ వ్యవహారంలోనే ఎస్సై సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×