E-Paper
Advertisement

CM Revanthreddy Tour: సిద్దిపేట్‌కు సీఎం రేవంత్.. కోకాకోలా గ్రీన్ ప్లాంట్ ప్రారంభం

CM Revanthreddy Tour: సిద్దిపేట్‌కు సీఎం రేవంత్.. కోకాకోలా గ్రీన్ ప్లాంట్ ప్రారంభం
Advertisement

CM Revanthreddy Tour: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సిద్ధిపేట్‌కి వెళ్తున్నారు. సిద్దిపేట జిల్లాలో హెచ్‌సీసీబీ ఏర్పాటు చేసిన కోకా కోలా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బివరేజెస్ సంస్థ సిద్ధిపేట్ జిల్లాలో భారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్కులో నిర్మించిన భారీ బాట్లింగ్ యూనిట్‌ను సిఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు.

Advertisement

దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉద్యోగాలు లభించ నున్నాయి. హెచ్‌సీసీబీకి 49 ఎకరాల భూమిని కేటాయించింది ప్రభుత్వం.

మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు బేగంపేట నుంచి సిద్ధిపేటకు హెలికాప్టర్​లో చేరుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్‌‌‌రెడ్డి. మధ్యాహ్నం 2 గంటలకు బండ తిమ్మాపూర్ వద్ద HCCB కోకా కోలా ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు.

Advertisement

మూడు గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు ముఖ్యమంత్రి. మూడున్నరకు ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఉత్సవాల్లో  పాల్గొంటారు.

Related News

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

మా తీర్పులు కాగితాలకే పరిమితమా..? పీరియడ్ హైజీన్ ఉత్తర్వుల అమలుపై సుప్రీం కోర్టు ఫైర్!

తెలంగాణలో 429 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్..?

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

వనపర్తి ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాభివృద్ధికి రాజా కృష్ణదేవరావు అభయం!

Big Stories

Advertisement
×