E-Paper
Advertisement

Eesha Rebba: ఇండస్ట్రీ అలాంటి వాళ్లకే సపోర్ట్ చేస్తుంది.. గుట్టురట్టు చేసిన ఈషా!

Eesha Rebba: ఇండస్ట్రీ అలాంటి వాళ్లకే సపోర్ట్ చేస్తుంది.. గుట్టురట్టు చేసిన ఈషా!
Advertisement

Eesha Rebba: వరంగల్లో ఒక తెలుగు కుటుంబంలో పుట్టి.. హైదరాబాద్లో పెరిగి.. ఎంబీఏ పట్టా అందుకొని.. కళాశాలలో ఉన్నప్పుడే మోడలింగ్ రంగంపై ఆసక్తి కలిగి.. అలా ఇండస్ట్రీలోకి వచ్చింది తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా (Eesha Rebba). తొలిసారి దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే సినిమాతో ఇండస్ట్రీకి అరంగేట్రం చేసిన ఈషా రెబ్బ.. తొలిసారి ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమా దక్షిణాఫ్రికాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా నామినేట్ అయ్యి.. ఈషా రెబ్బాకు మంచి పేరు అందించింది.

విలక్షణ నటిగా గుర్తింపు..

ఒకవైపు గ్లామర్ వలకబోస్తూ.. నటిగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా 2018లో వచ్చిన ‘ఆవ్’ అనే చిత్రంలో లెస్బియన్ పాత్రను కూడా పోషించి.. విలక్షణ నటిగా పేరు సొంతం చేసుకుంది. అరవింద సమేత వీర రాఘవ, బ్రాండ్ బాబు, సవ్యసాచి , సుబ్రహ్మణ్యపురం అంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ‘ఒట్టు’ అనే చిత్రంతో మలయాళ సినిమా ప్రవేశం కూడా చేసింది. ఈ చిత్రంలో తన పాత్ర కోసం విలు విద్యతో పాటు కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకుంది. ప్రస్తుతం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే చిత్రంతో జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) హీరోగా వచ్చిన ఈ సినిమా భార్యాభర్తల కాన్సెప్ట్ తో తెరకెక్కింది. వన్ ప్లస్ వన్ ఆఫర్ టికెట్ ప్రైజ్ ను కూడా ఈ సినిమా నిర్మాతలు అందుబాటులోకి తీసుకొచ్చారు.

అలాంటి వాళ్ళకే ఇండస్ట్రీ అవకాశం ఇస్తుంది..

Advertisement

మరోవైపు వరుస ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొంటుంది చిత్ర బృందం. అందులో భాగంగానే ఈషా రెబ్బ ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో విషయాలను పంచుకుంది. అందులో భాగంగానే ఇండస్ట్రీ అలాంటి వాళ్లకే అవకాశం ఇస్తుంది అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టారు అంటే దాదాపు పది సంవత్సరాల పాటు కొనసాగేవారు. ఆ తర్వాత కనిపించేవారు కాదు. మీ దృష్టిలో ఈ విషయాన్ని ఎలా చూస్తారు? అని యాంకర్ ప్రశ్నించారు .

ఈషా రెబ్బ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో ఇక్కడ అన్ని వర్కౌట్ అవుతాయి. అందం ఉండి టాలెంట్ లేకపోయినా.. టాలెంట్ ఉండి అందం లేకపోయినా.. అవకాశాలు మాత్రం లభిస్తాయి. క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏం చేస్తున్నారు? అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అవకాశాలు లభిస్తాయి. కరోనా తర్వాత ఓటీటీ అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు అందం, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు లభిస్తున్నాయి. అయితే నేను చెప్పే విషయం ఏమిటంటే.. అందం , టాలెంట్ అనే విషయం పక్కన పెడితే.. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎవరికైతే ఎక్కువ ప్రతిభ ఉంటుందో వారే ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు అందుకుంటారు.

అప్పుడు నాకు అంత బ్రెయిన్ లేదు..

Advertisement

ఇక మీ విషయంలో ఎలా జరిగింది? అని యాంకర్ ప్రశ్నించగా..” ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నాకు అంత బ్రెయిన్ లేదు. ఇండస్ట్రీలో ఒక వ్యక్తిని ఎలా చూస్తున్నారు. ఏంటి.. అనే విషయాలపై అవగాహన ఉండేది కాదు. అయితే ఇప్పుడు అన్ని విషయాలపై అవగాహన వచ్చింది. ఎక్కడ ఎలా చూస్తున్నారో అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కథలు ఎంపిక విషయంలో అడుగులు వేస్తున్నాను” అంటూ ఈషా చెప్పుకొచ్చింది.

Also read: Actress Fined: అరుణాచలం కొండెక్కిన ప్రముఖ నటి.. జరిమానా విధించిన అధికారులు, ఎందుకంటే?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×