E-Paper
Advertisement

Vikarabad District: తాగిన మత్తులో డీసీఎం డ్రైవర్ బీభత్సం.. తృటిలో తప్పించుకున్న చిన్నారి, వీడియో వైరల్

Vikarabad District: తాగిన మత్తులో డీసీఎం డ్రైవర్ బీభత్సం.. తృటిలో తప్పించుకున్న చిన్నారి, వీడియో వైరల్
Advertisement

Vikarabad District:  వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు  ప్రమాదం చోటుచేసుకుంది. పరిగి మున్సిపాలిటీ పరిధిలోని బహార్ పేట్ చౌరస్తా వద్ద జరిగిన ఈ సంఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

అతివేగంగా దూసుకొచ్చిన ఓ ఐరన్ స్క్రాప్ డీసీఎం (DCM) వాహనం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఆ సమయంలో ఫుట్‌పాత్‌పై పార్క్ చేసి ఉన్న ఆటోలు, బైకుల మీదకు ఈ భారీ వాహనం దూసుకెళ్లడంతో..  వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. లారీ వేగాన్ని చూసిన స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

Advertisement

ఈ ప్రమాదంలో ఒక హృదయవిదారకమైన దృశ్యం అందరినీ కదిలించింది. రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్నారి ప్రమాదానికి అత్యంత సమీపంలో ఉంది. డీసీఎం బోల్తా పడుతున్న క్షణంలో..  అక్కడ ఉన్న ఒక వ్యక్తి చిరుత వేగంతో స్పందించాడు. రెప్పపాటు కాలంలో ఆ చిన్నారిని పక్కకు లాగేయడంతో ఆ పాప ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడింది. ‘క్షణకాలం ఆలస్యమైనా ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసేవి’ అంటూ ప్రత్యక్ష సాక్షులు ఆ వ్యక్తి సాహసాన్ని కొనియాడారు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Advertisement

సమాచారం అందుకున్న పరిగి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని..  ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ జరుపుతున్నారు. జనావాసాల మధ్య ఇలా అతివేగంగా.. మద్యం తాగి వాహనాలు నడపడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: Anantapur: క్లాస్ రూమ్‌లో ఫిట్స్ వచ్చి విద్యార్థిని మృతి.. ఎస్కే యూనివర్శిటీలో విషాదం

Related News

తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు బంపర్ ఆఫర్..11 కేవీ కనెక్షన్లపై సరికొత్త నిబంధనలు!

నర్సింగ్ కౌన్సిల్ ఖాతాల్లో కోట్ల రూపాయలు.. మరి ఆ డబ్బంతా ఏమైనట్లు?

మోడీని ఎదుర్కొనే దమ్ములేక ఈసీ, ఈవీఎంలపై నిందలా? కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్!

ఎమ్మెల్సీ బరిలో ఆ ఇద్దరు నేతలు.. రేవంత్ రెడ్డి మార్క్ మాస్టర్ ప్లాన్!

రాహుల్ కాదు కదా.. ఆయన జేజమ్మ వచ్చినా మోడీని ఏమీ చేయలేరు: ఈటల రాజేందర్

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

Big Stories

Advertisement
×