E-Paper
Advertisement

Notices to Actor Ali: కమెడియన్ ఆలీకి నోటీసులు.. రిప్లై ఎలా ఉంటుందో?

Notices to Actor Ali: కమెడియన్ ఆలీకి నోటీసులు.. రిప్లై ఎలా ఉంటుందో?
Advertisement

Notices to Actor Ali: అక్రమంగా ఏదైనా నిర్మాణం సాగిస్తున్నారా.. అయితే మీకు నోటీసులు వస్తాయి సుమా. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు పూర్తి దృష్టి సారించారు. ఇప్పటికే హైడ్రా ధాటికి ఆక్రమణదారుల గుండెలు ఘుభేల్ మంటుంటే, మరో వైపు పంచాయతీ అధికారులు కూడా ఎక్కడ అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే అక్కడ వాలిపోతున్నారట. అందుకే హైదరాబాద్ నగరంలో ఏదైనా స్థలం కొనుగోలు చేయాలన్నా, గృహాలు చేయాలన్నా అసలు అన్నీ ధృవీకరణ పత్రాలు ఉన్నాయా లేవా అంటూ కొనుగోలు దారులు ఆరా తీస్తున్నారట. అయితే తాజాగా పంచాయతీ అధికారులు షాకింగ్ న్యూస్ వెల్లడించారు.

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే సంబంధిత అధికారులు పూర్తి దృష్టి సారించిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి నోటీసులు సైతం జారీ చేస్తున్నారు వారు. ఆ నోటీసుల పర్వం ప్రస్తుతం టాలీవుడ్ కమెడియన్ ఆలీ వరకు చేరింది. అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారంటూ పంచాయతీ కార్యదర్శి శోభారాణి తాజాగా నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

Advertisement

వికారాబాద్ నవాబ్ పేట లోని ఏక్ మామిడి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 345 లో ఆలీ తండ్రి భాషా పేరు మీద ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్ హౌస్ లో ఎటువంటి అనుమతులు లేకుండా ఆలీ అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారట. గ్రామపంచాయతీ కార్యదర్శి శోభారాణి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని గుర్తించి ఈనెల 5వ తేదీన నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులకు ఎటువంటి రిప్లై లేకపోవడంతో మరో నోటీసును కూడా జారీ చేశారు.

Also Read: Tirumala Laddu Adulteration: తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం.. ఏఆర్ డైయిరీలో తనిఖీలు.. ఆ సమయం ఆసన్నమైందా?

Advertisement

రెండవ నోటీసులో నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయో, అందుకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలను తీసుకుని గ్రామపంచాయతీ కార్యాలయంను సంప్రదించాలని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. కాగా రెండు దఫాలుగా నోటీసులు అందుకున్న ఆలీ, ఈ విషయంపై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అసలు అక్రమంగా నిర్మాణాలు సాగుతున్నాయన్న విషయం ఏమో కానీ ఆలీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో నోటీసులు జారీ చేయడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×