Constable Night Duty Murder| ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవడానికి రాత్రి వేళ పోలీసులు పాట్రోలింగ్ చేస్తుంటారు. ఎక్కడా దొంగలు, దోపిడీలు, ఇతర నేరాలు జరగకుండా కాపలా కాస్తుంటారు. అలా రాత్రివేళ పాట్రోలింగ్ చేస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. అనుమాస్పదంగా దొంగలు అనుకొని వారిని అడ్డుకోవడానికి వెళ్లగా.. ఆ దొంగలు ఏకంగా అతడిని కత్తితో పొడిచేశారు. ఈ ఘటన రాజధాని ఢిల్లీలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. రెండు రోజుల క్రితం సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కిరణ్ పాల్ నైట్ డ్యూటీ పాట్రోలింగ్ లో ఉన్నాడు. ఉదయం 5.30 సమయంలో కానిస్టేబుల్ కిరణ్ పాల్ తన బైక్ లో వెళుతుండగా.. ముగ్గురు యువకులు అనుమాస్పదంగా కనిపించారు. ఆ ముగ్గురు యువకులు కూడా ఒక బైక్ లో వెళుతున్నారు. వారిని గోవింద్ పురి లేన్ నెంబర్ 13 వద్ద కిరణ్ పాల్ ఆపడానికి ప్రయత్నించాడు. కానీ వారు బైక్ ఆపకుండా ముందుసాగారు.
Also Read: దాగుడు మూతలు ఆడుతూ యువకుడి హత్య.. ప్రియురాలు అరెస్ట్
దీంతో కానిస్టేబుల్ కిరణ్ పాల్ వారిని వెంబడించి తన బైక్‌తో అడ్డగించాడు. ఆ తరువాత బైక్ మీద నుంచి దిగి.. ముగ్గురు యువకుల బైక్ కీస్ తీసేసుకున్నాడు. దీంతో ఆ ముగ్గురు యువకుడు కానిస్టేబుల్ కిరణ్ పాల్ తో వాగ్వాదం చేశారు. ఈ క్రమంలోనే ఒకరు కత్తితో కిరణ్ పాల్ ఛాతిభాగంతో పొడిచాడు. మరొకడు కిరణ్ పాల్ కడుపులో కత్తితో పొడిచాడు. ఆ వెంటనే వారి బైక్ కీస్ తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు.
కిరణ్ పాల్ తీవ్ర గాయాలతో సమీప పోలీస్ స్టేషన్‌కు సమచారం అందించాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కిరణ్ పాల్ ని సమీపంలోని మజిదియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ కిరణ్ పాల్ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ నగరానికి చెందిన 28 ఏళ్ల కిరణ్ పాల్ 2018లో పోలీస్ ఉద్యోగంలో చేరాడు. మార్చి 2024 నుంచి గోవింద్ పురి పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తున్నాడు. అతనికి పెళ్లికాలేదు. కుటుంబంలో ఒక తల్లి, అన్న, వదిన ఉన్నారు.
కిరణ్ పాల్ పై దాడి చేసిన యువకులను పట్టుకోవడానికి పోలీసులు ఆ ప్రాంతంలోని సిసిటీవీ వీడియోలను పరిశీలించారు. దీంతో ఆ ముగ్గురు డ్రగ్స్ కు అలవాటు పడి గతంలో దొంగతనలు చేసిన దీపక్ మ్యాక్స్ (20), క్రిష్ గుప్తా (18) అని తేలింది. మూడో యువకుడు గురించి పోలీసుల వద్ద సమాచారం లేదు. నిందితులు అదే ప్రాంతంలోని డిడిఏ ఫ్లాట్స్ లో ఉంటున్నారని సమాచారం అందింది.
Also Read: స్కృడ్రైవర్‌తో పొడిచి పొడిచి హత్య.. భర్తను వదిలి బాయ్‌ఫ్రెండ్‌తో 4 పిల్లల తల్లి సహజీవనం
దీంతో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు వెళ్లగా.. దీపక్ మ్యాక్స్, క్రిష్ గుప్తా పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దీపక్ కాలికి బుల్లెట్ గాయం అయింది. ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.