Big Stories

Vladimir Putin: ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ప్రమాణ స్వీకారం..

Vladimir Putin: రష్యా దేశాధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్ లో పుతిన్ ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

- Advertisement -

రష్యా అధ్యక్షుడిగా ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఐదోసారి పుతిన్ రష్యా అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. దీంతో మరో ఆరేళ్ల పాటు పుతిన్ దేశధినేతగా కొనసాగనున్నారు. మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్ లో పుతిన్ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి యూఎస్ సహా పలు దేశాలు దూరంగా ఉన్నాయి.

- Advertisement -

పుతిన్ తన కార్యాలయం నుంచి ప్రత్యేక కారులో క్రెమ్లిన్ ప్యాలెస్ కు వెళ్లారు. అనంతరం ఎరుపు రంగులో ఉన్న అక్కడి రాజ్యాంగం మీద పుతిన్ ప్రమాణం చేశారు. రాజ్యాంగాన్ని పరరక్షిస్తానని వెల్లడించారు. అక్కడి చీఫ్ జస్టిస్ వలెరి జోర్కిన్.. పుతిన్ ప్రమాణ స్వీకరం చేసి అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వడాన్ని ధ్రువీకరించారు.

2000, 2004, 2012, 2018 సంవత్సరాల్లో పుతిన్ రష్యా అధినేతగా ప్రమాణం చేశారు. ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ 87.28 శాతం ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఐదోసారి దేశధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పుతిన్.. సుధీర్ఘకాలం రష్యా అధినేతగా కొనసాగిన నేతగా చరిత్ర లిఖించనున్నారు. రష్యాను అత్యధిక కాలం పాలించిన స్టాలిన్ రికార్డును పుతిన్ తిరగరాయనున్నారు.

1999లో పుతిన్ ఎల్సిన్ రష్యా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి.. రష్యా తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రష్యా అధ్యక్ష పదవికి 2000వ సంవత్సరంలో ఎన్నికలు జరగ్గా.. పుతిన్ అధికారికంగా దేశాధ్యక్షుడయ్యారు.

Also Read: సునీతా విలియమ్స్ 3వ అంతరిక్ష యాత్ర ఆలస్యం.. సాంకేతిక లోపమే కారణమా?

అయితే రష్యా రాజ్యాంగం ప్రకారం ఓ వ్యక్తి రెండు సార్లు మాత్రమే దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. రాజ్యాంగాన్ని మార్చి మరీ పుతిన్ ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన.. 2030వ సంవత్సరం వరకు దేశాధినేతగా కొనసాగనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News