BigTV English

AP Weather News : హమ్మయ్య.. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఏపీలో భారీ వర్షం

AP Weather News : హమ్మయ్య.. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఏపీలో భారీ వర్షం

Rains in Andhra Pradesh : మండుటెండల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. నిన్న రాత్రి నుంచి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వాతావరణంలో అనూహ్యంగా మార్పులొచ్చాయి. ఆకాశమంతా మేఘాలు కమ్ముకుని చల్లనిగాలులు వీస్తున్నాయి. దీంతో.. మాడుపగిలే ఎండలతో అల్లాడిపోయిన ప్రజలు.. కాస్త ఉపశమనం పొందుతున్నారు. అల్లూరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే పాడేరు, అరకు ఏజెన్సీలోనూ భారీ వర్షం కురిసింది.


తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా.. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీని కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడినట్లు చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంతటా మేఘాలు విస్తరించి ఉన్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరంలో ఆకాశం మేఘావృతమై ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

Also Read : ఏపీకి భారీ వర్షసూచన.. నేడు ఈ జిల్లాల్లో వడగాల్పులు


అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రం.. వేడిగాలులు, ఎండలు తప్పవని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఏదేమైనా.. ఇన్నిరోజులకు రాష్ట్రంలో వాతావరణం చల్లబడటంతో ప్రజలు సేదతీరుతున్నారు. తెలంగాణలోనూ వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి.

 

 

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×