BigTV English

Lady Aghori – Srivarshini : అఘోరీని ఎన్‌కౌంటర్ చేయాలి.. పోలీసులతో వర్షిణి హంగామా..

Lady Aghori – Srivarshini : అఘోరీని ఎన్‌కౌంటర్ చేయాలి.. పోలీసులతో వర్షిణి హంగామా..

Lady Aghori – Srivarshini : లేడీ అఘోరీ అరెస్టుతో వర్షిణి ఎపిసోడ్ మరో టర్న్ తీసుకుంది. చీటింగ్ కేసులో అఘోరీ 14 రోజులు జైల్లోనే ఉండాలి. ఆ తర్వాత కూడా బయటకు ఎప్పుడు వస్తుందో తెలీదు. అప్పటివరకూ వర్షిణి పరిస్థితి ఏంటి? ఎక్కడ ఉంటుంది? ఎలా బతుకుతుంది? అఘోరీ జైలు పాలయ్యాక వర్షిణి ఇప్పుడు ఎక్కడుంది? అనేది ఇంట్రెస్టింగ్.


పోలీస్ స్టేషన్లో వర్షిణి హంగామా

అఘోరీని, వర్షిణిని యూపీలో అదుపులోకి తీసుకుని తెలంగాణకు తీసుకొచ్చారు పోలీసులు. లేడీ అఘోరీకి కోర్టు రిమాండ్ విధించడంతో.. వర్షిణిని తాత్కాలికంగా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఉంచారు. అయితే, తనను అఘోరీ దగ్గరికే పంపాలంటూ స్టేషన్లో గొడవ గొడవ చేస్తోంది వర్షిణి. తనను లేడీస్ జైల్లో ఉంచాలని.. బీటెక్ కూడా కంప్లీట్ చేయించాలని.. ఆ బాధ్యత పోలీసులే తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అలా కుదరదు అంటున్న పోలీసులతో వాగ్వాదానికి దిగుతోంది. అరుపులు, తిట్లు, ఏడుపులతో పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ చేస్తోంది శ్రీవర్షిణి.


వర్షిణి మానసిక ఆరోగ్యంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లు రీ హాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచి చికిత్స చేయించాలని భావిస్తున్నారు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

వర్షిణి కోసం పేరెంట్స్‌

వర్షిణి కోసం ఆమె తల్లిదండ్రులు శంకర్‌పల్లి పీఎస్‌కు వచ్చారు. తమతో ఇంటికి వచ్చేయాలని కూతురుని వేడుకున్నారు. అయితే, పేరెంట్స్‌తో వెళ్లేందుకు వర్షిణి నిరాకరిస్తోంది. అవసరమైతే తన అత్తారింటికి వెళ్తానంటూ చెబుతోంది. తల్లిదండ్రులతో ఉండేందుకు తిరస్కరిస్తోంది. తమ కూతురుని తమతో పంపించాలని పోలీసులను వేడుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. మంగళగిరి తీసుకెళ్తామని.. కావాలంటే అక్కడే రీ హాబిలిటేషన్ సెంటర్లో చేర్పిస్తామని అంటున్నరాు. అయితే, వర్షిణిని పేరెంట్స్‌తో పంపించలేమని పోలీసులు చెబుతున్నారు.

అఘోరీని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్

తమ బిడ్డకు అఘోరీ డ్రగ్స్ ఇచ్చి.. తన గుప్పిట్లో ఉంచుకుందని ఆరోపిస్తున్నారు వర్షిణి పేరెంట్స్. వర్షిణిని అమ్ముకోవడానికో.. లేదంటే, నరబలి ఇచ్చేందుకో.. అఘోరీ మత్తు పెట్టి ఉంటాడని అంటున్నారు. తమ కూతురు జీవితాన్ని నాశనం చేసిన అఘోరీని ఎన్‌కౌంటర్ చేసి చంపేయాలని డిమాండ్ చేస్తోంది వర్షిణి తల్లి.

వర్షిణి కోసం అఘోరీ రచ్చ

మరోవైపు, అటు సంగారెడ్డి సబ్ జైలులోనూ.. తనకు వర్షిణి కావాలంటూ లేడీ అఘోరీ రచ్చ రచ్చ చేసింది. వర్షిణిని తనతో పాటే జైల్లో ఉంచాలంటూ నానా హంగామా చేసింది. రూల్స్ ఒప్పుకోవంటూ పోలీసులు ఎంత చెబుతున్నా వినకుండా అరుపులు, కేకలతో అఘోరీ ఆగమాగం చేసింది.

Also Read : ఆడా? మగా? అఘోరీకి జైల్ అధికారుల షాక్..

ట్విస్టులే ట్విస్టులు..

అఘోరీ వెడ్స్ వర్షిణి.. చీటింగ్ కేసు విడదీసింది వాళ్లిద్దరినీ. అఘోరీ జైలుకు.. మరి, వర్షిణి కథ ఎటు? ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నట్టే.. వర్షిణికి అఘోరీ డ్రగ్స్ ఇచ్చిందా? నరబలి కోసమే ఇదంతా చేస్తోందా? వర్షిణిని అమ్మేస్తుందా? ఇక వర్షిణి తల్లిదండ్రుల చెంతకు చేరడం కష్టమేనా? డైలీ సీరియల్‌గా సాగుతున్న వీళ్ల ఎపిసోడ్‌లో ఇంకా ఎలాంటి ట్విస్టులు ఉంటాయో చూడాలి…

Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×