Srinidhi Shetty : ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్లందరూ కేవలం ఒకదానికే పరిమితం అయిపోకుండా వివిధ రకాల పనుల్లో ఇన్వాల్వ్ అవుతూ నేర్చుకుంటున్నారు. ఇక తెలుగు సినిమా విషయానికి వస్తే చాలామంది మల్టీ టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి వంటి హీరోలు కేవలం నటించడం మాత్రమే కాకుండా స్క్రిప్ట్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతూ తమ పెను కదుపుతూ ఉంటారు. నవీన్ పోలిశెట్టి టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిన విషయమే. రైటర్ గా తనకి టాలెంట్ ఉండటం వల్లనే అద్భుతమైన కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. విశ్వక్సేన్ కేవలం నటించడం మాత్రమే కాకుండా దర్శకుడుగా కూడా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. టిల్లు అనే క్యారెక్టర్ ను సిద్దు జొన్నలగడ్డ ఎలా డిజైన్ చేశాడు అందరూ ఆశ్చర్యపడ్డారు.
కేవలం నటిగానే కాకుండా
నటి శ్రీనిధి శెట్టి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే. సౌత్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన కేజిఎఫ్ అంటే సినిమాలో నటించింది కాబట్టి. కే జి ఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. దానికి సీక్వల్ గా వచ్చిన కే జి ఎఫ్ 2 సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఆ సినిమాలు తర్వాత తెలుగులో వరుసగా అవకాశాల అందుకుంది శ్రీనిధి శెట్టి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తెలుసు కదా సినిమాలో ప్రస్తుతం హీరోయిన్ గా చేస్తుంది. అలానే నాని నటించిన హిట్ 3 సినిమాలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అయితే కేవలం ఈ సినిమాలో నటిగానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసింది. ఈ విషయాన్ని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు నాని.
మే 1 విడుదల
ఇక ఈ సినిమా మే ఒకటి నా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నాని యాక్షన్ ఫిలిమ్స్ చేస్తే చూడాలనుకునే ప్రేక్షకులు అందరికీ ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుంది అని నాని ఇదివరకే తెలిపాడు. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ విపరీతమైన అంచనాలను పెంచుతుంది. ఇదివరకే వచ్చిన హిట్, హిట్ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సాధించాయి. వాటన్నిటిని మించి ఈ సినిమా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో మే 1న తెలియనుంది.
Also Read : Vijaya Santhi : చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు, జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్నాను