BigTV English

Lady Aghori : ఆడా? మగా?.. అఘోరీకి జైల్ అధికారుల షాక్.. ఆ టెస్ట్ చేయాల్సిందే..

Lady Aghori : ఆడా? మగా?.. అఘోరీకి జైల్ అధికారుల షాక్.. ఆ టెస్ట్ చేయాల్సిందే..

Lady Aghori : చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్ట్ అయ్యారు. యూపీలో అదుపులోకి తీసుకుని.. నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్ట గా.. అక్కడ హైడ్రామా నెలకొంది. తన తరఫున వాదించడానికి లాయర్లు లేరని.. తనకు అంత స్తోమత లేదని.. అఘోరీ న్యాయమూర్తికి తెలిపింది. దీంతో కోర్టు తరఫున ఒక అడ్వొకేట్‌ను అఘోరీ కోసం కేటాయించారు. అనంతరం.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది న్యాయస్థానం.


అఘోరీని ఏ జైల్లో పెడతారు? 

ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ పరిణామం. అఘోరీ ఓ ట్రాన్స్‌జెండర్. ఆమెను ఇప్పుడు జైల్లో.. పురుషుల సెల్‌లో ఉంచుతారా? మహిళల సెల్‌లో పెడతారా? అనేది పెద్ద సమస్యగా మారింది. ఇదే విషయంపై అఘోరీ తరఫున లీగల్ హెడ్‌గా నియమితులైన లాయర్‌ను ప్రశ్నించింది బిగ్ టీవీ. అయితే, అఘోరీని పురుషుల బ్యారక్‌‌కు తరలిస్తారా? మహిళల బ్యారక్‌కు తీసుకెళతారా? అనేది ఆమె తరఫు లాయర్ కూడా చెప్పలేకపోతుండటం ఆసక్తికరం. ఏ జైలుకు అనేది.. పోలీసులు, డాక్టర్లు నిర్ణయిస్తారని.. అది తనకు తెలీదని బిగ్ టీవీతో చెప్పారు అఘోరీ తరఫు లాయర్. త్వరలోనే అఘోరీ కోసం బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తానని అన్నారు. అటు, అఘోరీని కస్టడీకి తీసుకుని ప్రశ్నించేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదీ సంగతి.


అఘోరీకి జైలు అధికారుల షాక్

చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరికి సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైలు అధికారుల షాక్ ఇచ్చారు. ఆడ, మగ తేలకుండా తాము జైల్లోని ఏ బ్యారక్ లోనూ ఉంచలేమని తిరిగి పంపించేశారు. లింగ నిర్ధారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమని చెప్పారు. దీంతో అఘోరీని ఇప్పుడు ఎక్కడ ఉంచాలో అర్థం కాక పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రాన్స్‌జెండర్ ఫీమేల్‌గా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. కంది జైల్లో ఈ కేటగిరి వాళ్లను తీసుకోమంటూ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో అఘోరీకి మరోసారి వైద్య పరీక్షలు చేయించేందుకు లేడీ అఘోరీని చేవెళ్లకు తరలించారు మొకిలా పోలీసులు. అయితే, చంచల్‌గూడ జైలులో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక బ్లాక్ ఉంది. వైద్యుల నివేదిక ఆధారంగా ఏ జైలుకు తరలించాలో నిర్ణయం తీసుకోనున్నారు.

వర్షిణి కోసం జైల్లో అఘోరీ హంగామా

మరోవైపు, కంది సబ్ జైలులో లేడీ అఘోరీ నానా హంగామా చేసింది. వర్షిణిని తనతోనే ఉంచాలంటూ పట్టుబడుతూ లొల్లి లొల్లి చేసింది. అరుపులు కేకలతో రచ్చ రచ్చ చేసింది. వర్షిణిని జైల్లో ఉంచేందుకు రూల్స్ ఒప్పుకోవంటూ పోలీసులు ఎంత చెప్పినా అఘోరీ ఒప్పుకోకపోవడంతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది.

Also Read : కశ్మీర్ టెర్రర్.. సర్జికల్ స్ట్రైక్ 2 జరగాల్సిందే..

అఘోరీపై చీటింగ్ కేసు ఏంటంటే..

యో*ని పూజ చేయిస్తానంటూ రూ. 10 లక్షలు వసూల్ చేసిందంటూ అఘోరీపై మోకిలా పీఎస్‌లో ఓ మహిళ కేసు పెట్టారు. ఉజ్జయినీ తీసుకెళ్లి తాంత్రిక పూజలు చేసిందని.. ఆ పేరు చెప్పి మళ్లీ మళ్లీ బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ కంప్లైంట్‌తో ఫిబ్రవరిలోనే అఘోరీపై FIR కూడా నమోదైంది. ఇటీవలే వర్షిణిని ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకుని యూపీలో కాపురం పెట్టిన అఘోరీ అడ్రస్ తెలుసుకుని.. అక్కడికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. కోర్టులో ప్రొడ్యూస్ చేయగా.. 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. అనంతరం, అఘోరీని జైలుకు తరలించారు. అఘోరీ జైల్లో ఉంటే.. మరి శ్రీవర్షిణి పరిస్థితి ఏంటి? అఘోరీ లేకుండా వర్షిణి ఉండగలదా? ఆమె ఫ్యూచర్ ఏంటి?

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×