E-Paper
Advertisement

హోం మంత్రి మన రేవంతన్నే.. పబ్ రచ్చపై ఆర్ఎస్పీ సెటైర్లు !

హోం మంత్రి మన రేవంతన్నే..  పబ్ రచ్చపై  ఆర్ఎస్పీ  సెటైర్లు !
Advertisement

Kara Kara Pub Fight:కారా కారా పబ్ వ్యవహారం ఇపుడు తెలంగాణ రాజకీయాల్లో పబ్ మంటలు పుట్టిస్తుంది.విషయంలోకి వెళ్తే జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ ‘కారా కారా’ పబ్బులో ఆదివారం తెల్లవారుజామున రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.పీకలదాకా తాగిన దాదాపు 150 మంది యువకులు రెండు వర్గాలుగా విడిపోయి విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. అక్కడ దొరికిన మద్యం సీసాలు, కుర్చీలు విసురుకుని  పబ్బుని రణరంగంగా మార్చారు .

అయితే ఈ పబ్ గొడవ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక రాజ్యసభ సభ్యుని కుమారుడి పాత్ర ఉందనే వార్తలు బయటకు రావడం తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంది. పాత కక్షల వల్లే ఈ దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

Advertisement

హోం మంత్రి మన రేవంతన్న నే

ఇక ఇదే విషయం పై బీఆర్‌ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో హోం శాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పోలీసు వ్యవస్థను టార్గెట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు ప్రవీణ్ కుమార్ .

Advertisement

హోం మంత్రి మన రేవంతన్న నే… ఏంత తన్నుకున్నా కేసులు పెట్టే ధమ్ము ఎవరికీ లేదు..అంటూ సర్కార్ పై సెటైర్లు వేశారు.ఇక కాంగ్రెస్ యువ నేతలు పబ్బుల గబ్బులో మునిగి తేలుతున్నారని మహా నగర పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని మండిపడ్డారు.గొడవ జరిగి ఇన్ని గంటలవుతున్నా కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు.

పబ్బు యజమాని ఫిర్యాదు చేయకపోయినా, జరిగిన తీవ్రతను బట్టి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అరవింద్ యాదవ్ ఆ సమయంలో ఆయన ఎక్కడ

అసలు ఈ ఘటనలో నిందితులు ఎవరు, వారిని అరెస్ట్ చేశారా లేదా అన్న విషయాలను ఓపెన్ గా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా యూత్ కాంగ్రెస్ నేత అరవింద్ యాదవ్ ఆ సమయంలో ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి టవర్ లొకేషన్లు, పబ్బులోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున 2 గంటల వరకు పబ్ నడుస్తుంటే నైట్ డ్యూటీలో ఉన్న సెక్టర్ ఎస్సై, నైట్ సూపర్‌వైజరీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. తక్షణమే ‘కారా కారా’ పబ్ లైసెన్సును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో

ఒక వేళ సాధారణ పౌరులు ఇలాంటి దాడులకు పాల్పడితే వెంటనే అరెస్టులు చేసి మీడియా ముందుకు ప్రవేశపెట్టే పోలీసులు, అధికార పార్టీ నేతల పేర్లు వినిపించగానే ఎందుకు వెనకడుగు వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Also read :తల్లి పదవి పోయిందని సుస్మిత ఏడుపు.. సీఎం రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు

ఇక ఈ వ్యవహారంతో  చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు పబ్బులోని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయో, ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిందే !.

Tags

Related News

కేసీఆర్ దూకుడుతో కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్!

నర్సు హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మేజిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశం!

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సు, మెట్రోకు ఒకే పాస్!

రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు సీఎం రేవంత్ ప్రవేశపెట్టే కీలక నివేదికలివే?

మీ కోడళ్లకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా.. డీజీపీ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!

అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

3 ఏళ్ల బాబు మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్ చేసింది వాళ్లే

Big Stories

Advertisement
×