Kavitha Criticism: అసలు ఉద్దేశాలను పక్కన పెట్టేలా, డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలుగా కవిత తేల్చి పారేశారు. అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన చాలా సమస్యలు చర్చించాల్సినవి ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఉద్యమకారుల ఇష్యూపై క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నారు కవిత. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కూడా అసెంబ్లీ వేదికగా స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉందన్నారు. ప్రజలకు అనేక హామీలిచ్చి వచ్చిన ప్రభుత్వం.. అవేమీ నెరవేర్చకుండా పొలిటికల్ డైవర్షన్ వ్యూహాన్ని ఎంచుకున్నదని ఆమె విమర్శించారు.
వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్.. కాంగ్రెస్ డ్రామాలుడుతున్నాయని, ఈ రెండు పార్టీలకు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలనే సోయి లేదనే విధంగా కవిత విమర్శలు గుప్పించారు. వెయ్యి రోజుల పాలన పేరిట .. ఆ రెండు పార్టీలు రాజకీయాలకు ఇస్తున్న ప్రయార్టీ.. ప్రజా సమస్యలపై ఏమాత్రం ఇవ్వడం లేదని ఆమె ధ్వజమెత్తిన తీరు చర్చనీయాంశమవుతోంది. ఎన్నో సమస్యలపై చర్చించి చట్టాలు చేయాల్సిన అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ వస్తారా? రారా? అనేదే కీలకంగా మార్చి.. ప్రధాన సమస్యల నుంచి ప్రభుత్వం తప్పించుకోవాలనే ఎత్తుగడ కనిపిస్తోందని కవిత విమర్శించారు.
Also read: తల్లి పదవి పోయిందని సుస్మిత ఏడుపు.. సీఎం రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వ్యూహంలో చిక్కుకుని కేవలం రాజకీయాలకు, ప్రకటనలకే పరిమితమవుతోందని, ప్రజా సమస్యలను విస్మరించిందన్నారు కవిత. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదనేది ఖాయం. కానీ ఆయన వస్తారా? రారా? అనే సమస్యను సజీవంగా ఉంచడం కాంగ్రెస్ ఎత్తుగడలో ఓ భాగం. బీఆర్‌ఎస్ కూడా ఈ వ్యూహంలో చిక్కుకుని కేసీఆర్ సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతారంటూ కామెంట్ చేయడం మరో పెద్ద పొరపాటు. కానీ ఇప్పుడు కవిత చేసిన కామెంట్స్ చర్చకు వస్తున్నాయి. అసలు విషయాలను పక్కన బెట్టి.. అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయమే పరమావధిగా కొనసాగుతున్నారనే విషయాన్ని కవిత లేవనెత్తిన అంశం చర్చకు తెర లేపింది.
Also read: రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు సీఎం రేవంత్ ప్రవేశపెట్టే కీలక నివేదికలివే?