E-Paper
Advertisement

మాన్‌సూన్ వైబ్స్.. పుణేకి దగ్గర్లో ఉన్న 5 అద్భుతమైన హిడెన్ వాటర్‌ఫాల్స్ ఇవే!

మాన్‌సూన్ వైబ్స్.. పుణేకి దగ్గర్లో ఉన్న 5 అద్భుతమైన హిడెన్ వాటర్‌ఫాల్స్ ఇవే!
Advertisement

Hidden waterfalls near pune: వర్షాకాలం వచ్చిందంటే.. చాలు సహ్యాద్రి పర్వత శ్రేణులు.. పచ్చటి తివాచీ పరిచినట్లు మారిపోతాయి. ముఖ్యంగా పుణే చుట్టు పక్కల ప్రాంతాలు నేచర్ లవర్స్, ట్రెక్కింగ్ చేసేవారికి స్వర్గధామంగా మారుతాయి. చాలా మంది కేవలం లోనావాలా, ఖండాలా లాంటి క్రౌడ్ ఉండే ప్రదేశాలకే వెళ్తుంటారు. కానీ, జనాల రద్దీకి దూరంగా, గుట్టుగా దాగి ఉన్న కొన్ని అద్భుతమైన వాటర్ ఫాల్స్ పుణే సమీపంలో ఉన్నాయి. ఈ వర్షాకాలంలో మీరు ఖచ్చితంగా చూడాల్సిన 5  వాటర్ ఫాల్స్, వాటి ఖర్చుల వివరాలు ఇప్పుడు చూద్దాం.

పుణే దగ్గర్లో 5  వాటర్ ఫాల్స్:

వర్షపు చుక్కలు పడుతుంటే.. కొండల మధ్య నుంచి దూకే నీటి తుంపర్లు, దట్టమైన పొగమంచు మధ్య పయనించే.. ఫీల్ వర్ణనాతీతం. ఈ ప్రదేశాలు మీ వీకెండ్‌ను చిల్‌గా మార్చేస్తాయి.

1. కటల్ధార్ జలపాతం (Kataldhar Waterfall):

Advertisement

లోనావాలా సమీపంలోనే ఉన్నప్పటికీ, చాలా మందికి దీని గురించి తెలియదు. దట్టమైన అడవి గుండా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే ఈ  వాటర్ ఫాల్ కనిపిస్తుంది. కన్నులపండగగా పడే నీటి ధార, చుట్టూ ఉండే ప్రశాంతత ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి. దీనికి ఎంట్రీ ఫీజు ఏమీ ఉండదు. అయితే.. అడవి మార్గం కాబట్టి స్థానిక గైడ్‌ను కుదుర్చుకుంటే గ్రూప్‌కు రూ. 300 నుంచి రూ. 500 వరకు ఛార్జ్ చేస్తారు.

2. దేవ్‌కుండ్ జలపాతం (Devkund Waterfall):

భీరా ఆనకట్ట సమీపంలో ఉన్న ఈ వాటర్ ఫాల్ కొండల మధ్య ఒక సహజ సిద్ధమైన స్విమ్మింగ్ పూల్‌లా ఏర్పడుతుంది. స్వచ్ఛమైన నీరు, చుట్టూ ఉండే ఎత్తైన కొండల వ్యూ ఫోటోలకు, రీల్స్‌కి అదిరిపోయే బ్యాక్‌డ్రాప్‌ను ఇస్తుంది. స్థానిక విలేజ్ టూరిజమ్ కమిటీకి ఎంట్రీ, పార్కింగ్ ఫీజు కింద ఒక్కొక్కరికి రూ. 100 నుంచి రూ. 150 వరకు ఉంటుంది.

3. భివ్‌పురి / లువావాలా వాటర్ ఫాల్స్ (Bhivpuri/Tamhini Secret Falls):

Advertisement

తామ్‌హిని ఘాట్ మార్గంలో మెయిన్ డోర్ కాస్త లోపలికి వెళ్తే చిన్న చిన్న నామమాత్రపు దారుల్లో ఈ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. రహదారి రద్దీకి దూరంగా ప్రశాంతంగా స్నానం చేయడానికి, ప్రకృతిలో సమయం గడపడానికి ఇది పర్ఫెక్ట్. ఇక్కడ ఎలాంటి ఎంట్రీ ఫీజులు ఉండవు. ప్రైవేట్ వెహికిల్స్‌లో వెళ్తే పెట్రోల్ ఖర్చు మాత్రమే అవుతుంది.

4. థోకర్వాడి వాటర్ ఫాల్స్ (Thokarwadi Waterfall):

మవాల్ తాలూకాలోని థోకర్వాడి ఆనకట్ట బ్యాక్‌వాటర్స్ సమీపంలో.. ఉండే ఈ వాటర్ ఫాల్స్ ఇంకా ప్రచారం పొందని ఒక దాచిన రత్నం. వాటర్ ఫాల్స్ చుట్టూ ఉండే వరి పొలాలు, ప్రశాంతమైన వాతావరణం మైండ్ రిలీఫ్ ఇస్తాయి. దీనికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు.

5. షిరోటా లాక్ వాటర్ ఫాల్స్ (Shirota Lock Waterfall):

రాజ్‌మాచి ట్రెక్ మార్గానికి దగ్గరలో ఉన్న ఈ ప్లేస్‌లు అడ్వెంచర్ ఇష్టపడేవారికి అనువైంది. చుట్టూ దట్టమైన చెట్లు, చిన్నపాటి చినుకుల మధ్య సాగే వాకింగ్ ఒక అద్భుత ఫీల్ ఇస్తుంది. స్థానికంగా ఆహారానికి రూ. 150 – రూ. 200 వరకు ఖర్చవుతుంది.

Also Read: గోవా వెళ్లే ప్లాన్ ఉందా? వర్షాకాలంలో ఈ ప్లేస్‌లు చూడకపోతే మీ ట్రిప్ వేస్ట్ అయినట్టే!

లాభాలు:
కమర్షియల్ ప్రదేశాల కంటే.. జనాల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది.

సహజ సిద్ధమైన వాతావరణం, అద్భుతమైన ఫోటోగ్రఫీ స్పాట్స్ దొరుకుతాయి.

తక్కువ ఖర్చుతో.. కూడిన వీకెండ్ గేట్‌వే.

మీరు రూటీన్ లోనావాలా, ఖండాలాలకు స్వస్తి చెప్పి, ఈ వర్షా కాలంలో ప్రకృతికి  దగ్గరగా గడపాలంటే.. పుణే దగ్గర్లో ఈ 5 హిడెన్ వాటర్ ఫాల్స్  తప్పకుండా చూడండి.

Related News

రైలు ప్రయాణంలో మీ సీటు వేరే వ్యక్తి ఆక్రమించారా? గొడవ పడొద్దు.. వెంటనే ఈ పని చేయండి

బీచ్‌లో పిల్లాడిని వదిలేసి.. తల్లిదండ్రుల రీల్స్, ఛీ కొంచెమైనా సిగ్గుందా?

ప్రకృతితో కలిసి ప్రయాణం.. భారత్‌ లో చూడాల్సిన 7 విస్టాడోమ్ రైల్వే రూట్స్ ఇవే!

ప్రయాణికులకు అలర్ట్.. వందే భారత్ సహా పలు రైళ్ల టైమ్ మారింది!

కొడుకు కోసం 24 ఏళ్ల వెతుకులాట.. ఈ తండ్రి కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

ఫ్యాన్స్‌ ను వెర్రోళ్లను చేసిన నా అన్వేష్.. మళ్లీ మాట తప్పేశాడుగా!

ఇండియాకు వచ్చేస్తానన్న అన్వేష్.. అదేదో ఆపరేషన్ అన్నావ్ ఏమైంది బ్రో అంటున్న నెటిజన్లు?

వేల కిలోమీటర్ల రైలు ప్రయాణం.. అయినా, వేడివేడి భోజనం ఎలా అందిస్తారు?

Big Stories

Advertisement
×