E-Paper
Advertisement

గోవా వెళ్లే ప్లాన్ ఉందా? వర్షాకాలంలో ఈ ప్లేస్‌లు చూడకపోతే మీ ట్రిప్ వేస్ట్ అయినట్టే!

గోవా వెళ్లే ప్లాన్ ఉందా? వర్షాకాలంలో ఈ ప్లేస్‌లు చూడకపోతే మీ ట్రిప్ వేస్ట్ అయినట్టే!
Advertisement

Monsoon Goa Trip: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది గోవా ట్రిప్ వాయిదా వేస్తుంటారు. కానీ నిజం చెప్పాలంటే.. మాన్‌సూన్‌లోనే గోవా తన అసలైన పచ్చటి అందాలను పరుస్తుంది! తుంపర్లు పడుతుంటే కొండలు, జలపాతాలు, ఖాళీగా ఉండే బీచ్‌లు ఇన్‌స్టాగ్రామ్ లవర్స్‌కి స్వర్గధామంలా మారతాయి. మీ ఇన్‌స్టా ప్రొఫైల్, రీల్స్‌ని సరికొత్త వైబ్‌తో నింపేయడానికి ఈ వర్షాకాలంలో గోవాలో తప్పకుండా చూడాల్సిన 5 అద్భుతమైన ప్రదేశాలు, ఖర్చుల వివరాలు ఇప్పుడు చూద్దాం.

గోవా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌లు:

1. దూధ్‌సాగార్ వాటర్ ఫాల్స్ (Dudhsagar Waterfalls):

వర్షాకాలంలో నిండుగా ప్రవహించే దూధ్‌సాగార్ వాటర్ ఫాల్స్ పాలధారలా మెరిసిపోతుంది. ఈ కొండల మధ్యలో పాలు పొంగినట్లు పడే నీటి సీన్ మీ ఇన్‌స్టాగ్రామ్ ఫ్రేమ్‌కి అదిరిపోయే లుక్ ఇస్తుంది. ఇక్కడ రైలు వెళ్లే బ్రిడ్జ్ , వాటర్ ఫాల్ బ్యాక్‌గ్రౌండ్ ఫోటోలు ఎంతో ట్రెండింగ్‌గా ఉంటాయి. దీనిని చూడటానికి భగవాన్ మహావీర్ శాంక్చురీ ఎంట్రీ ఫీజు దాదాపు రూ. 50 నుంచి రూ. 100 వరకు ఉంటుంది. అలాగే జీప్ సఫారీ కూడా అందుబాటులో ఉంటే ఒక్కొక్కరికి రూ. 500 నుంచి రూ. 800 వరకు ఛార్జ్ చేస్తారు.

2. చాపోరా కోట (Chapora Fort):

Advertisement

‘దిల్ చాహ్తా హై’ సినిమాతో పాపులర్ అయిన చాపోరా కోట, వర్షా కాలంలో చుట్టూ పచ్చటి కొండలతో , ఎదురుగా ఉప్పొంగే అరేబియా సముద్రపు వ్యూతో కనువిందు చేస్తుంది. ఇక్కడ కోట గోడలపై కూర్చుని సముద్రం వైపు చూస్తూ తీసే ఫోటోలు, సన్‌సెట్ రీల్స్ ఇన్‌స్టాలో బాగా వైరల్ అవుతాయి. ఈ కోట ఎంట్రీ పూర్తిగా ఉచితం, కాకపోతే ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.

3. ఫంటైన్హాస్ – లాటిన్ క్వార్టర్ (Fontainhas, Panjim):

పనాజీలో ఉండే ఈ పాత పోర్చుగీస్ వీధులు మిమ్మల్ని నేరుగా యూరప్‌కి తీసుకెళ్లిన అనుభూతిని ఇస్తాయి. వర్షంలో తడిసిన రంగురంగుల ఇళ్ళు, వింటేజ్ తలుపులు, కేఫ్‌లు ఇన్‌స్టాగ్రామ్ ఫోటోగ్రాఫర్లకు ఇష్టమైన స్పాట్‌గా నిలుస్తాయి. ఇక్కడి కలర్‌ఫుల్ వాల్స్ బ్యాక్‌డ్రాప్‌గా డిఫరెంట్ ఔట్‌ఫిట్స్‌తో స్టైలిష్ ఫోటోలు క్లిక్ అనిపించవచ్చు. ఈ వీధుల్లో నడుస్తూ ఎంచక్కా ఫోటోలు తీసుకోవచ్చు.

4. దివాడ్ ఐలాండ్ (Divar Island):

Advertisement

పనాజీకి దగ్గర్లోని మాండోవి నది మధ్యలో ఉండే ఈ చిన్న దీవికి ఫెర్రీ (పడవ) ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడ ఉండే పచ్చని వరి పొలాలు, ప్రశాంతమైన వాతావరణం మనసుకి ఎంతో హాయిని ఇచ్చి మైండ్ రిలాక్స్ చేస్తాయి. పడవ ప్రయాణం చేసేటప్పుడు నది అందాలను ఆస్వాదిస్తూ బైక్ రైడింగ్ రీల్స్ చేయడానికి ఇది బెస్ట్ స్పాట్. వ్యక్తులకు ఫెర్రీ ప్రయాణం ఉచితం, ఒకవేళ కార్ లేదా బైక్ తీసుకెళ్తే రూ. 10 నుంచి రూ. 20 మాత్రమే ఛార్జ్ చేస్తారు.

5. అంజునా & అరంబోల్ బీచ్ కేఫ్‌లు (Anjuna & Arambol Beach Cafes):

వర్షాకాలంలో సముద్రంలో ఈత కొట్టడం సురక్షితం కానప్పటికీ, తీరంలో ఉండే వుడెన్ కేఫ్‌లలో కూర్చుని పడే వర్షాన్ని, ఎగసిపడే అలలను చూడటం ఒక ప్రత్యేకమైన ఫీల్ ఇస్తుంది. ఇక్కడి కేఫ్ ఆంబియెన్స్, కాఫీ కప్పులు, వర్షపు చుక్కల బ్యాక్‌గ్రౌండ్ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ఇద్దరికి కేఫ్‌లలో ఫుడ్ , డ్రింక్స్ కోసం సగటున రూ. 800 నుంచి రూ. 1,500 వరకు ఖర్చవుతుంది.

వర్షాకాలంలో గోవా వెళ్లడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సమయంలో తక్కువ బడ్జెట్‌లోనే మంచి హోటళ్ళు, రెంట్ స్కూటర్లు లభిస్తాయి. అంతే కాకుండా జనాల రద్దీ చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రశాంతమైన వాతావరణం లభించడమే కాక ఫోటోలకు క్లియర్ ఫ్రేమ్స్ దొరుకుతాయి. చుట్టూ పరుచుకునే ప్రకృతి పచ్చదనంతో ఇది ప్రకృతి ప్రేమికులకు పండగలా ఉంటుంది.

జాగ్రత్తలు:

మాన్సూన్ సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భారీ వర్షాల వల్ల వాటర్ స్పోర్ట్స్ , క్రూయిజ్ రైడ్స్ అందుబాటులో ఉండవు. అలాగే సముద్రం తీవ్రంగా అలజడిగా ఉండటం వల్ల బీచ్‌లలో ఈత కొట్టడం ప్రమాదకరం, కాబట్టి జాగ్రత్త వహించాలి.

వర్షాకాలంలో గోవా కేవలం బీచ్‌లకే పరిమితం కాకుండా, అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి నిలయంగా మారుతుంది. మీరు రీల్స్, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి, ప్రశాంతమైన వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వర్షాకాలంలో గోవా ట్రిప్ ప్లాన్ చేయడం ఒక అద్భుతమైన ఐడియా!

Related News

రైళ్లలో సీట్ల కొరత తీరినట్లే.. త్వరలో 17,000 కొత్త జనరల్, స్లీపర్ కోచ్‌లు!

హోటల్ గదుల్లో గడియారాలు ఎందుకు ఉండవో తెలుసా? దీని వెనుక మిస్టరీ ఇదే!

హైదరాబాద్‌లో ఏం జరిగింది? ముగ్గురు పైలట్లకు అస్వస్థత, విచారణ చేపట్టిన బ్రిటిష్ ఎయిర్‌వేస్

మంచి క్వాలిటీ స్టైలిష్ జీన్స్ కేవలం రూ.200.. దేశంలోనే బడ్జెట్ షాపింగ్ మార్కెట్ ఇదే

ఫ్రీ ఫ్రీ.. దుబాయ్‌లో హోటల్ స్టే, డిన్నర్, ట్రావెల్ అన్నీ ఉచితం.. ప్రభుత్వం కొత్త ఆఫర్

కాచిగూడ స్టేషన్‌ కు మెగా మేకోవర్.. రూపు మారుతుంది.. కానీ, వారసత్వం చెక్కుచెదరదు!

12 స్టేషన్లు.. 320 కి.మీ స్పీడ్.. బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు!

Big Stories

Advertisement
×