E-Paper
Advertisement

Waterfalls In Winter: వణికించే చలిలో.. వయ్యారంగా ప్రవహించే అద్భుత జలపాతాలు ఇవే !

Waterfalls In Winter: వణికించే చలిలో.. వయ్యారంగా ప్రవహించే అద్భుత జలపాతాలు ఇవే !
Advertisement

Waterfalls In Winter: చలికాలంలో ఇండియాలోని అనేక ప్రాంతాలు మంచు కురిసే అద్భుత లోకంలా మారతాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో పర్వత ప్రాంతాలు, అడవుల్లోని జలపాతాలు ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. పచ్చని ప్రకృతి మధ్య పాలార్లల్లా జాలువారే ఈ జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. చలికాలంలో మీరు తప్పక చూడాల్సిన 7 అద్భుతమైన జలపాతాల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. దూద్‌సాగర్ జలపాతం (గోవా):

గోవా అంటే కేవలం బీచ్‌లు మాత్రమే కాదు.. పశ్చిమ కనుమల్లో ఉన్న ‘దూద్‌సాగర్’ కూడా ఇందుకు ప్రధాన ఆకర్షణ. దీని పేరుకు తగ్గట్టే ఇది “పాల సముద్రం”లా కనిపిస్తుంది. చలికాలంలో ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అడవి గుండా సాగే ట్రెకింగ్ , రైల్వే వంతెన పైనుంచి కనిపించే ఈ దృశ్యం మంత్రముగ్ధులను చేస్తుంది.

Advertisement

2. జోగ్ జలపాతం (కర్ణాటక):

కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉన్న జోగ్ జలపాతం ఇండియాలోనే ఎత్తైన జలపాతాలలో ఒకటి. శరవతి నది నుంచి నాలుగు చీలికలుగా (రాజా, రాణి, రోరర్, రాకెట్) కిందకు పడే ఈ జలపాతం చలికాలంలో పొగమంచు మధ్య చాలా అందంగా కనిపిస్తుంది.

3. చిత్రకూట్ జలపాతం (ఛత్తీస్‌గఢ్):

దీనిని “ఇండియా నయాగరా” అని పిలుస్తారు. ఇంద్రావతి నదిపై ఉన్న ఈ జలపాతం గుర్రపు నాడా ఆకారంలో ఉంటుంది. వర్షాకాలంలో ఇది భీకరంగా ఉన్నప్పటికీ, చలికాలం వచ్చే సరికి నీరు నిర్మలంగా మారి, చుట్టూ ఉన్న పచ్చదనం మధ్య అద్భుతమైన రంగుల్లో కనిపిస్తుంది.

4. అతిరపిల్లి జలపాతం (కేరళ):

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఉన్న అతిరపిల్లి జలపాతం అనేక సినిమాలకు (ముఖ్యంగా బాహుబలి) వేదికైంది. చలికాలంలో ఇక్కడి అడవిలో గాలి చాలా చల్లగా ఉంటుంది. జలపాతం దగ్గర ఉంటే వచ్చే సన్నని నీటి తుంపరలు పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇస్తాయి.

5. హోగెనక్కల్ జలపాతం (తమిళనాడు):

కావేరి నదిపై ఉన్న ఈ జలపాతాన్ని “భారతదేశపు నయాగరా” అని కూడా పిలుస్తుంటారు. చలికాలంలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ కొట్టెదోనె ప్రయాణం చేయడం చాలా సురక్షితం. అంతే కాకుడా సరదాగా కూడా ఉంటుంది. రాతి కొండల మధ్య నుంచి ప్రవహించే నీరు చూడటానికి అద్భుతంగా ఉంటుంది.

Also Read: స్విట్జర్లాండ్ అక్కర్లేదు.. ఇండియాలోనే మంచు కురిసే బెస్ట్ స్పాట్స్

6. నోహ్కలికై జలపాతం (మేఘాలయ):

చిరపుంజీలో ఉన్న ఈ జలపాతం ఇండియాలోనే అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటి. చలికాలంలో మేఘాలయలో మేఘాలు తక్కువగా ఉండి.. ఆకాశం స్పష్టంగా ఉంటుంది. అప్పుడు ఈ జలపాతం కింద ఏర్పడే పచ్చటి రంగు గుంట స్పష్టంగా కనిపిస్తూ మాయా ప్రపంచాన్ని తలపిస్తుంది.

7. తలకోన జలపాతం (ఏపీ):

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారికి చలికాలంలో తలకోన ఒక స్వర్గంలా కనిపిస్తుంది. చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ జలపాతం చుట్టూ దట్టమైన అడవి, ఔషధ గుణాలున్న నీరు ఉంటుంది. చలిలో ఇక్కడి ట్రెక్కింగ్ చేయడం పర్యాటకులకు ఎంతో ఇష్టమైన పని.

ప్రకృతి ప్రేమికులకు చలికాలం ఒక గొప్ప వరం. ఈ ఏడు జలపాతాలు కేవలం నీటి ప్రవాహాలు మాత్రమే కాదు.. అవి ప్రకృతి ప్రసాదించిన అందమైన చిత్రపటాలు. మీరు కూడా వింటర్ టూర్ ప్లాన్ చేసుకుంటే.. వీటిలో ఏదో ఒక దానిని తప్పక ఎంచుకోండి.

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×