E-Paper
Advertisement

అంతరిక్ష యాత్ర ఇక సామాన్యులకూ సాధ్యమే.. గగన్‌యాన్ మిషన్‌తో కొత్త ఆశలు!

అంతరిక్ష యాత్ర ఇక సామాన్యులకూ సాధ్యమే.. గగన్‌యాన్ మిషన్‌తో కొత్త ఆశలు!
Advertisement

Space Travel for Everyone: అంతరిక్ష యాత్ర అంటే ఇప్పటి వరకు కోటీశ్వరులకు, శాస్త్రవేత్తలకు మాత్రమే సాధ్యమయ్యే ప్రయాణంగా చాలామంది భావిస్తున్నారు. అయితే, భవిష్యత్తులో సామాన్యులు కూడా అంతరిక్షంలోకి వెళ్లే రోజులు వస్తాయని గగన్‌యాన్ వ్యోమగామిగా ఎంపికైన అంగద్ ప్రతాప్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే మూడు, నాలుగు దశాబ్దాల్లో సాధారణ ప్రజలు కూడా కనీసం ఒక్కసారైనా అంతరిక్ష యాత్ర చేసే అవకాశాలు ఏర్పడతాయని ఆయన చెప్పుకొచ్చారు.

అందుబాటు ధరలో అంతరిక్ష యాత్ర లక్ష్యంగా

భారతీయ అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా తక్కువ ఖర్చుతో మనుషులను అంతరిక్షంలోకి పంపడం కీలక లక్ష్యమని అంగద్ ప్రతాప్ చెప్పుకొచ్చారు. అమెరికాలో ప్రస్తుతం ఒక సాధారణ సబ్‌ ఆర్బిటల్ అంతరిక్ష యాత్రకు సుమారు రూ.3 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఈ ఖర్చులు తగ్గే అవకాశం ఉందన్నారు. ఒకప్పుడు కమర్షియల్ విమాన ప్రయాణం కూడా ఊహకు అందని విషయమని, ఇప్పుడు సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని గుర్తుచేశారు. అదే విధంగా అంతరిక్ష యాత్ర కూడా భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల పాత్ర కీలకం

Advertisement

మానవ అంతరిక్ష యాత్రలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం చాలా ముఖ్యమని అంగద్ చెప్పారు. ఈ రంగంలో భారత్ ముందుకు సాగాలంటే ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ కంపెనీలు కూడా పనిచేయాలని తెలిపారు. ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇస్రో కూడా అవసరమైన చర్యలు తీసుకుంటోందని వివరించారు. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే భవిష్యత్తులో యాత్రల ఖర్చు తగ్గే అవకాశం ఉంటుందన్నారు.

ఎయిర్ ఫోర్స్ ఎక్స్ పీరియెన్స్ తో..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 44 ఏళ్ల అంగద్ ప్రతాప్ భారత వైమానిక దళంలో పనిచేసిన అనుభవం తన అంతరిక్ష శిక్షణకు ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. ముఖ్యంగా ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం, క్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాల్లో ఆ అనుభవం తనకు బలంగా నిలిచిందన్నారు. మిగ్ యుద్ధ విమానాలను నడిపిన ఎక్స్ పీరియెన్స్ కూడా తనకు మరింత లాభం కలిగించిందన్నారు. విమానయానంలో ఉన్న పరిజ్ఞానం అంతరిక్ష ప్రయాణంలోనూ ఉపయోగపడుతుందని తెలిపారు.

Advertisement

అంతరిక్ష యాత్రకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం కూడా అవసరమని అంగద్ అభిప్రాయపడ్డారు. శిక్షణలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం అత్యంత సవాలుతో కూడుకున్న అంశమని చెప్పారు. ఇలాంటి మిషన్లలో అనేక విభాగాల నిపుణులు కలిసి పనిచేస్తారని, అందుకు అనుగుణంగా వ్యోమగాములు నిరంతరం తమను తాము మెరుగుపరుచుకోవాల్సి ఉంటుందని వివరించారు. అంతరిక్ష యాత్రలో ఒక్కరి పాత్రను ప్రత్యేకంగా చెప్పడం కష్టమని, ఇలాంటి కార్యక్రమాలు అనేక బృందాల సమష్టి కృషితోనే విజయవంతమవుతాయని ఆయన స్పష్టం చేశారు.

Read Also: విమానాల్లో ఫైవ్ స్టార్ రేంజ్ ఫుడ్.. ఎయిర్ ఇండియా క్రేజీ ప్లాన్!

Tags

Related News

పారిస్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇండియన్ ఎంబసీ ఏం చెప్పిందంటే?

ట్రాఫిక్‌లో చిక్కుకొని రైలు మిస్ అవుతుందని టెన్షన్ వద్దు.. మీ సమస్యకు పరిష్కారం ఇదే

విమానాల్లో ఫైవ్ స్టార్ రేంజ్ ఫుడ్.. ఎయిర్ ఇండియా క్రేజీ ప్లాన్!

ఇండియాను చూసేందుకు ఉద్యోగాలు వదిలేసిన యూరప్ అమ్మాయిలు.. వందే భారత్ జర్నీ చూసి..

సౌదీలో క్షిపణి దాడులు.. భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరికలు!

రైల్లో క్యాన్సర్ పేషెంట్ మృతి.. 12 గంటల పాటు మృతదేహంతో ప్రయాణికుల అవస్థలు!

గోల్డెన్ చారియట్ రైలులో తక్కువ ధరకే ప్రయాణం? ప్రభుత్వం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×