E-Paper
Advertisement

Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి తప్పిన ముప్పు.. రన్‌వేపై ఊడిన చక్రాలు, చివరకు ఏం జరిగింది?

Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి తప్పిన ముప్పు.. రన్‌వేపై ఊడిన చక్రాలు, చివరకు ఏం జరిగింది?
Advertisement

Air India Express: ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా రన్‌వేపై చక్రాలు ఊడి పడ్డాయి. ఆ సమయంలో విమానంలో 133 మంది ప్రయాణికులు ఉన్నారు. చివరికి వారంతా ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి తప్పిన ముప్పు

Advertisement

హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌కు బుధవారం ఉదయం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం బయలుదేరింది. ఉదయం 11.40 గంటలకు ఫుకెట్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యింది. రన్ వేపై ల్యాండింగ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా కుదుపు లోనైంది. దీంతో నోస్-వీల్ సమస్య తలెత్తింది. పరిస్థితి గమనించిన పైలట్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని హార్ట్ ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఆ సమయంలో విమానంలో 133 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఒక్కసారిగా ట్రావెలర్స్, విమాన సిబ్బంది భయభ్రాంతులయ్యారు. సేఫ్‌గా ల్యాండింగ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. విమానం హార్డ్ ల్యాండింగ్ చేయడంవల్ల ల్యాండింగ్ గేర్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రన్ వే కూడా కాస్త డ్యామేజ్ అయ్యింది. దీంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌పోర్టుని మూసివేశారు.

Advertisement

రన్‌వేపై ఊడిన చక్రాలు.. ప్రయాణికులు సేఫ్

ప్రాథమిక తనిఖీలో విమానం నోస్ ల్యాండింగ్ గేర్ దెబ్బతిన్నట్లు తేలింది. దీనివల్ల విమానం రన్‌వే నుండి ఏ మాత్రం కదలదు. ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఓ ప్రకటన చేసింది. తమ సిబ్బంది అన్ని ప్రామాణిక ప్రోటోకాల్‌ పాటించారని తెలిపింది. అతిథులను విమానం నుండి దింపినట్టు ఎయిరిండియా వెల్లడించింది. ఫుకెట్ విమానాశ్రయ అధికారులు, అందరి సహకారానికి కృతజ్ఞతలు చెప్పింది.

విమానం ల్యాండింగ్‌ అయ్యేటప్పుడు భూమిని బలంగా వాటి చక్రాలు తాకడాన్ని హార్డ్‌ ల్యాండింగ్‌ అంటారు. ఈ సమయంలో రన్‌వేపై బౌన్స్‌ కావడంతో చక్రాలపై ఒత్తిడి పెరిగింది. విమానం నేలపై ఉన్నప్పుడు దాని ముందు సపోర్టు ఇచ్చేది నోస్‌ వీల్‌. రన్‌వేపై వెళ్లినప్పుడు టేకాఫ్-ల్యాండింగ్‌ సమయాల్లో సరైన దిశలో నడిపించడానికి అత్యంత కీలకం. ఏదైనా సమస్య తలెత్తితే విమానంపై పైలట్ నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది.

ALSO READ: వందే భారత్ రైల్ కోచ్‌లను ఎలా తయారు చేస్తారో చూడాలని ఉందా? ఇదిగో వీడియో!

 

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×